8 April, 2026 | 2:00 PM

హిందూ సమ్మేళనానికి ఆహ్వానం

08-04-2026 12:04 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజు పల్లి గ్రామంలో హిందూ సమ్మేళనం కోసం గ్రామస్తులకు సమితి నిర్వాహకులు ఆహ్వానం పలికారు.నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలో శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, యువతతో పాటు గ్రామస్తులందరికీ ఆహ్వానం పలికారు. హిందూ సమాజ ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.హిందూ బంధువులందరూ భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.