18 July, 2026 | 4:40 PM

ప్రముఖ నటి అనుమానాస్పద మృతి

11-06-2024 02:04 AM

ఫ్లాట్‌లో శవమై కనిపించిన మాలబికా దాస్

ముంబై, జూన్ 10 : ప్రముఖ వెబ్‌సిరీస్ నటి నూర్ మాలబికా దాస్ (37) ముంబైలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాస న వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నూర్ ఉండే ఫ్లాట్‌ను పరిశీలించారు. ఆమె మృతదేహం కుళ్లిపో యిన స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. విచారణలో భాగంగా ఆమె వాడుతున్న మెడిసిన్, మొబైల్ ఫోన్‌లతో సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫ్లాట్‌లో సూసైడ్ నోట్ కనిపించలేదని అధికారులు తెలిపారు. 

పలు వెబ్‌సిరీస్‌లలో నటన..

నూర్ మాలబికా దాస్ బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్ర లో నటించిన ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. తొలుత ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. తర్వాత సినిమాలపై మక్కువ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సిస్కి యాన్, వాల్క మాన్, తీఖీ చట్నీ, జఘ న్య ఉపాయ, చరమ్ సుఖ్, దేఖి అందే ఖి, బ్యాక్‌రోడ్ హస్టేల్ వంటి సినిమా లు, వెబ్ సిరీస్‌లలో నటించింది.