11 April, 2026 | 3:48 AM

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

11-04-2026 01:40 AM

రూ.లక్ష ౬వేలు నగదు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం

కేయూ పీఎస్ పరిధిలోని గోపాలపూర్ వెంకటేశ్వరకాలనీలో ఘటన

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ నరసింహారావు తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి నరసింహారావు మాట్లాడుతూ కేయూ పోలీ స్ స్టేషన్ పరిధిలోని గోపాలపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన గట్ల రాజేష్ తన నివా సంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 11 మందిని ఒక ముఠాగాచేసుకొని క్రిక్ 666.లైవ్ వెబ్‌సైట్ ద్వారా కొంతకాలంగా క్రికెట్ పోటీల సమయంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విశ్వాసనీయ సమాచార ప్రకారం దా డులు నిర్వహించి, విచారించగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితుల నుంచి లక్ష ఆరు వేల రూపాయల నగదు,12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిని తదుపరి విచారణ కోసం కేయూసీ పోలీసులకు అప్పగించామన్నారు.  సీఐ ఎస్. రవి కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాజు, కేయూసీ ఎస్‌ఐ నవీన్ కుమార్, కానిస్టేబుల్ రాజశేఖర్, సం తోష్, సాంబరాజు, సాల్మన్ పాల్గొన్నారు.