17 June, 2026 | 12:21 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

28 నుంచి ఐపీఎల్

09-03-2026 02:03 AM

ముంబై, మార్చి 8: క్రికెట్ అభిమానులు ఎదురుచూపులకు తెరపడింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ తేదీ ఖారారైంది. మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మొదలుకాబోతోంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్స్‌స్పోర్ట్ దీనిని ధృవీకరించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆరంభానికి ముందు ఈ తేదీని ప్రకటించారు. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. తమిళనాడు, అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండడంతో భద్రతాపరమైన సమస్యలు కారణంగా షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయనున్నారు. తొలి దశలో 25 మ్యాచ్‌లు ఉండేలా ప్లాన్ చేసారు. రెండో దశలో మిగిలిన టోర్నీ పూర్తయ్యేలా, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులు లేకుండా సీజన్‌ను పూర్తి చేసేలా బీసీసీఐ కసరత్తు పూర్తి చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపైనే సీజన్ ఆరంభమయ్యే అవకాశాలు కని పిస్తున్నాయి. గత ఏడాది చిన్నస్వామి స్టేడి యం బయట తొక్కిసలాట ఘటనతో అక్కడ మ్యాచ్‌లను నిషేధం విధించగా.. చివరికి కొన్ని కఠిన ఆంక్షలతో కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే మే 31 వరకూ ఐపీఎల్ జరగనుండగా.. దేశవ్యాప్తంగా 14 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి.