17-01-2026 06:05:38 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపీఎస్)కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ నెల 10వ తేదీన ఎన్‌టీపీసీ జ్యోతి నగర్ జడ్‌పి హెచ్‌ఎస్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఐపీఎస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. అండర్ 8 విభాగంలో రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో అద్విత మాన్వి, అండర్10 విభాగంలో లాంగ్ జంప్‌లో బొల్లి దేవాన్ష్, అండర్ 14 విభాగంలో రన్నింగ్ పోటీలో మాటేటి సంప్రీత్ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 18న ఆదిలాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ శనివారం అభినందించారు.విద్యార్థుల విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, క్రమశిక్షణ, కఠిన సాధన ముఖ్య కారణమని, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మరింత ప్రతిష్ఠ తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం,శివ,సతీష్ , మమత తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.