calender_icon.png 17 January, 2026 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన ఎస్సై

17-01-2026 06:09:01 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించడంలో రోడ్డు భద్రతపై అవగాహన ఎంతో అవసరమని అందులో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్ గౌడ్ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

మొదటి బహుమతి బెస్త నవనీత 1200 నగదు, రెండోవ బహుమతి మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి హేమలత 700 నగదు, మూడవ బహుమతి జేడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థి ఉమామహేశ్వరి 600 నగదు చొప్పున అందజేయడం జరిగిందని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ సబత్ కృష్ణ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.