calender_icon.png 17 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ, బీఆర్ఎస్

17-01-2026 05:58:59 PM

- మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 

- డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్నారని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం నగరంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా గ్రామాల్లో 70శాతానికి పైగా ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీ వైపు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఉన్న అన్ని మున్సిపాలిటీలలో 90శాతం పైగా మేం గెలుచు కోబోతున్నామని తెలిపారు. 

బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా, పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీయాలంటే ఆ రెండు పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందన్నారు. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీల వారు 30 శాతానికి దాటలేదని, ఈ ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ విధమైన పొత్తు పెట్టుకున్నప్పటికీ 10%  శాతానికే పరిమితం అవుతారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి అందరికీ తెలుసన్నారు. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి పేదోడికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు,

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో గాని ఏ ఒక్క పేదోడికి మా ప్రభుత్వము వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు సరైన సందర్భం వచ్చినప్పుడు, కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.  ఎన్నికల్లో ఒక గ్లోబల్ ప్రచారంతో ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాము,

నకిలీ సర్వేలు, సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు.  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి ఫ్రస్టేషన్లో ఉండి మొన్నటివరకు మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు మాకు చాలా సంపద ఉంది అని విర్రవీగుతూ ఆగమాగంగా రోజుకో జిల్లా పర్యటన చేస్తూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని పది సంవత్సరాలు ఇటు బి ఆర్ఎస్ అటు భారతీయ జనతా పార్టీ,  కేంద్రంలో  భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అవినీతి కవలుగా ఉండి అభివృద్ధిని చేయకుండా నగర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారన్నారు. 

ఇద్దరు కలిసి ఈ కరీంనగర్ నగరాన్ని ధ్వంసం చేసిండ్రు అవినీతికి అడ్డగా మార్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈ కరీంనగర్ పట్టనానికి చెందిన నాయకున్ని కరీంనగర్ ఎంపీగా గెలిపించి కేంద్రమంత్రి ని చేశారు, నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. మన కరీంనగర్ కూడా హైదరాబాదు లాగా అభివృద్ధి కావాలంటే నగర ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

గత పది సంవత్సరాలలో ఖాళీ జాగా కనబడితే దాన్ని కబ్జా చేసే పరిస్థితి కనపడిందని, స్మార్ట్ సిటీ సేఫ్ సిటీగా ఉండాలంటే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకొని కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నాయకులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మేనేని రాజనర్సింగారావు, ముద్దం తిరుపతి, ముద్దసాని రంగన్న, బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, రామిడి రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, లింగంపల్లి బాబు, ముద్దం తిరుపతి, కుంభాల రాజ్ కుమార్, సిరికొండ శివప్రసాద్, నెల్లి నరేష్, కంకణాల అనిల్ కుమార్, ఇరుమళ్ళ  మల్లేశం, ఇమ్రాన్, పెంట శేఖర్, పర్వత మల్లేశం, అందశంకర్, దీకొండ శేఖర్, బత్తుల రాజకుమార్, మంద మహేష్, సత్తినేని శ్రీకాంత్, దుబాసి కుమార్, తదితరులు పాల్గొన్నారు.