calender_icon.png 26 May, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు చేసిన తెల్దారుపల్లి వాసికి డాక్టరేట్

26-05-2025 12:22:20 AM

తండ్రి బాటలో తనయుడు..

వైరా, మే 25 (విజయక్రాంతి): గత నాలుగు సంవత్సరాలుగా కెమిస్ట్రీ విభాగంలో క్యాన్సర్ వైద్యంలో వాడే మందుల కెమికల్ కాంబినేషన్స్ పై కన్నెకంటి ప్రవీణ్ కుమార్ చేసిన పరిశోధన లు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కన్నెకంటి ప్రవీణ్ కుమార్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో రసాయనశాస్త్ర విభాగంలో డిజైన్ అండ్ సింతసిస్ ఆఫ్ న్యూ ఇమిడజోల్ డెరివేటివ్స్ యాస్ యాంటి క్యాన్సర్ ఏజెంట్స్ అనే అంశంపై చేసిన పరిశోధనలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. దీంతో ఈ నెల 22న హైదరాబాద్ లో డాక్టరేట్ అందుకున్నాడు.

ప్రొఫెసర్ టి.నర్సింహ స్వామి పర్యవేక్షణలో హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్( ఐఐసిటి), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజి(సిసియంబి) సహకారంతో తాను చేసిన పరిశోధనల ఫలితాలను అత్యంత ప్రతిష్టాత్మకమైన జర్నల్ ఆఫ్ మాలిక్యులార్ స్త్రక్చర్ (ఎల్స్వియర్)సైన్స్ మ్యా గ్జైన్ లో వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ లో వాడే మందులపై తాను చేసిన ప్రయోగాల ఆధారంగా తయారుచేసే మందులవల్ల క్యాన్సర్ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కోవచని శాస్త్రీయంగా నిరూపించాడు.

క్యాన్సర్ వైద్యంలో ప్రస్తుతం వాడుతున్న మందులలో వాడే రసాయ నాల కాంబినేషన్స్ కంటే తాను సూచించిన రసాయనాల మిశ్రమాన్ని తగు మోతాదుల్లో వాడితే క్యాన్సర్ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చునని శాస్త్రీయంగా నిరూపించినట్లు ప్రవీణ్ ఈ సందర్బంగా తెలిపాడు. ’యాంటి ప్రోస్టేట్ క్యాన్సర్’,’హ్యూమన్ లంగ్ క్యాన్సర్’,బ్రెస్ట్ క్యాన్సర్ పై పరిశోధనా పత్రాలు అత్యంత ప్రామాణికంగా వెలువరించినట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శంకర్ లింగం,చైర్మన్ పురుషోత్తమ రెడ్డి వెల్లడించారు.

ప్రవీణ్ కుమార్ ప్రాధమిక విద్యను సాం ఘిక సంక్షేమ గురుకులంలో చదవడం గమనార్హం.అంతర్జాతీయ స్థాయిలో సంక్షేమ గురుకులాల సత్తా చాటడం అభినందనీయమని తెలంగాణ గురుకుల ఆల్ రెసిడెన్సియల్ ఎంప్లాయి ఈస్ అసోసియేషన్ మల్టీనోనల్ అధ్యక్షుడు ఐనాల సైదులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల, దమ్మపే టలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న డా.కన్నెకంటి వెంకటేశ్వర్లు తన ఇద్దరు పిల్లలు (ప్రవీణ్ కుమా ర్,ప్రతిభ)లను గురుకులాల్లోనే చదివించి ఆదర్శంగా నిలిచారన్నారు.

కూతురు కన్నెకంటి ప్రతిభ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆఫ్తమాలజి లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పారా ఆఫ్తాల్మిక్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం సాధించగా కొడుకు ప్రవీణ్ కుమార్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సా ధించి నేటి గురుకుల విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఉద్యోగం చేస్తూ ఎకనమిక్స్ లో డాక్టరేట్ సాధించి తన గ్రామంలోని తోటివారికి స్పూర్తినిచ్చిన కన్నెకంటి వెంకటేశ్వర్లు తన ఇద్దరు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ను పలువురు గురుకుల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఐనాల సైదులు,దూలం యల్లయ్య,శ్రీనివాసులు,ఉషారత్నం,యల్.ఉపేందర్,మిరియాల ధర్మారావు,మధన్ లాల్,నాగరాజు,రామారావు,ఐ.భగవత్,మేళ్ళచెర్వు జానకి,సౌగంధి యసస్విని, సాయిలిఖిత, ప్రతిభ,రూప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.