ఒంటరిగా మిగిలిన ఇరాన్!
కావలి చెన్నయ్య :
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడికి జరిగే అవకాశం ఉంది. చర్చలతో సంబంధం లేకుండా దాడులు చేసేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్‌లో యుద్ధ భేరీ మోగనున్న తరుణంలో వివిధ కారణాల రీత్యా భారత విదేశాంగశాఖ ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని స్వదేశానికి తిరిగి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరిగిన సంఘర్షణ తారాస్థాయికి చేరిన తరుణంలో అమెరికా మధ్యవర్తిత్వం వ హించి తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిర్చింది. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికా లు పరస్పరం వాగ్భాణాలు సంధించుకుంటున్నాయి. ఇరాన్‌పై దాడికి సిధ్ధమంటూ అమెరికా హెచ్చరించడం, అందుకు ఇరాన్ ట్రంప్‌ను హేళన చేస్తూ గతంలో ఇరాక్, అఫ్గానిస్థాన్‌ల విషయాలను ప్రస్తావనకు తెచ్చింది. ఆయా దేశాల్లో అమెరికా బలగాల అర్ధాంతర ఉపసంహరణ గురించి ప్రస్తావిస్తూ అమెరికా తమను ఏమీ చేయదని పేర్కొనడంతో సమస్య జటిలంగా మారింది.
అంతర్గత సమస్యలు..
ఆహార ధరలు, కరెన్సీ తరుగుదల, ద్ర వ్యోల్బణం వంటి సమస్యలతో నిరాశ చెం దిన ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు ఇస్లామిక్ ప్రభుత్వాన్నే అంతం చేయాలనే దశకు చేరుకు న్నాయి. ఇరాన్‌లో అంతర్గత పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. -2026లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఇరాన్ సు ప్రీం లీడర్ అయొతొల్లా అలీ ఖమేని పరిపాలనకు వ్యతిరేకంగా అనేక విశ్వవిద్యాల యాల్లో నిరసనలు జరిగాయి.
టెహ్రాన్‌లో షరీఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ‘ఖమేని అత్యంత క్రూరమైన నాయ కుడనే’ నినాదాలతో నిరసన తెలుపుతూ ఇరాన్ మాజీ రాజు షా కుమారుడైన రెజా పహ్లావి ఇరాన్ అత్యున్నత పదవి అలంకరించాలంటూ డిమాండ్లకు దిగారు. టెహ్రా న్‌లోని షాహిద్ బెహెష్టి, అమీర్ కబీర్ విశ్వవిద్యాలయాలతో పాటు ఈశాన్య ప్రాం తంలోని మషద్ విశ్వవిద్యాలయంలో కూ డా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టడం తో.. ఇవన్నీ 1979 నాటి ఇస్లామిక్ విప్లవం సందర్భంగా జరిగిన నిరసనలను గుర్తుకుతెచ్చాయి. అమెరికా విధించిన ప్రత్యక్ష ఆంక్షలు, పశ్చిమదేశాలు విధించిన ఆంక్షల వల్ల ఇరాన్‌లో ఆర్థిక, సామాజిక సమస్యలు పెరిగిపోయాయి.
ఐఆర్‌జీసీ ప్రభావమెంత?
ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను)ను యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి అధికారికంగా ఉగ్రవాద జాబితాలో చేర్చిం ది. ఫలితంగా ఐఆర్‌జీసీకి చెందిన సైనికు లు, అధికారులపై నిషేధంతో పాటు వారి ఖాతాలు, ఆస్తులు స్తంభించిపోయాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్క దేశ సైన్యాన్ని ఉగ్రవాద జాబితాలో చేర్చిన దాఖలాలు లేవు. అయితే ఇరాన్‌కు మాత్ర మే ఆ స్థితి వచ్చింది.
ఇప్పటివరకు యూ రోపియన్ యూనియన్ జాబితాలో 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ఉగ్రవాద జాబితాలో ఉన్నాయి. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, ఐఆర్‌జీసీ అంతర్జాతీ య అనుసంధాన వ్యవస్థ కూడా చాలా వరకు దెబ్బతిన్నది. కాగా ఐఆర్‌జీసీని 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం నిరంత రం ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటం, ఇస్లామిక్ విప్లవాన్ని రక్షించడమే. ఐఆర్‌జీసీ కేవ లం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి మాత్ర మే జవాబుదారీగా ఉంటుంది తప్ప మరెవరికి వారు సమాధానం చెప్పాల్సిన పని ఉండదు
. దేశంలో ఇది సైనిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అత్యంత శక్తివంతమైన ది. అంతేకాదు ఐఆర్‌జీసీ వ్యవస్థ పాలస్తీనా, యెమెన్, సిరియా, ఇరాక్ దేశాల్లోని తీవ్రవాద సంస్థలకు, హెజ్బొల్లా, హౌతి వంటి తిరుగు బాటు సంస్థలకు ఆర్థిక, సైనిక సహాయం అందిస్తూ వచ్చింది. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో ఐఆర్‌జీసీ ఈ మధ్యనే చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసందిలో భారీ సైనిక విన్యాసాలు కూడా నిర్వహించింది.
రష్యా, చైనా దూరం..
ఇరాన్ మద్దతుదారుగా ఉన్న రష్యా ప్ర పంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగి ఉన్నది. ఇరాన్, రష్యాలు మం చి స్నేహబంధంతో అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాయి. కానీ ఇరాన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా అమెరికాతో ఘర్షణకు దిగేందుకు మాత్రం రష్యా ఇష్టపడడం లేదు. జూన్ 2025లో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై 12 రోజులు దాడులు చేసిన సమయంలో, రష్యా దాడులను ఖండించిందే తప్ప ప్రత్యక్షంగా ఏం చేయలేక పోయింది.
ఇక ఎప్పు డు సొంత ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని భావించే చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడో అతి పెద్ద సైనిక వ్యవస్థ కలిగి ఉంది. ఇరాన్‌తో చైనా కు సఖ్యత, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ అమెరికా బెదిరింపు ధోరణిని ఖండించిందే తప్ప ఇరాన్‌కు అండగా నిలబడినట్లు ఏ కోశానా కనిపించలేదు. అయి తే ఆర్థికంగా మనుగడ సాగించడం కోసం చైనాకు ఇరాన్ పెద్ద ఎత్తున చమురును విక్రయిస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే చైనా కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అమెరికానే కావడం గమనార్హం.
మద్దతివ్వని అరబ్ దేశాలు..
చైనా, రష్యాలు దూరమవడంతో ఒంట రి భావనలో కూరుకుపోయిన ఇరాన్‌కు తుర్కియే మాత్రమే కాస్తో కూస్తో మద్దతివ్వడం వారికి ఊరటనిచ్చే అంశం. కానీ అమెరికా విషయానికి వచ్చేసరికి తుర్కియే కూడా మెత్తబడుతున్నది. ఇరాన్ అంతర్గత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దని, ఆ దేశానికి అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే సత్తా ఉందంటూ ఈ ఏడాది జన వరి 13న తుర్కియే ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనిబట్టి ఇరాన్‌లో ఏం జరిగినా ఇస్లామిక్, అరబ్ దేశాలు పెద్దగా స్పందించేటట్లు కనిపించడం లేదు. ప్రస్తుత ఇస్లా మిక్ ప్రపంచం ఐక్యంగా లేకపోవడం, ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి వ్యూహా లు రచించకపోవడం, దీనికి తోడు ఈ దే శాలన్నీ అమెరికా ప్రభావానికి లోనవుతూ వస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా మొదటినుంచి ఇరాన్‌ను శత్రువుగానే చూస్తుం ది.
ఇరాన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అమెరికా పేర్కొంటున్నప్పటికీ, ప్రపంచ చమురు మార్కెట్‌లో మా త్రం తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశముందని ఒమన్, ఖతార్‌లు హెచ్చరిస్తూ యు ద్ధాన్ని విరమించుకోవాలని అమెరికాకు సూచిస్తున్నాయి. అయితే తమ దేశంపై దాడి జరిగితే మాత్రం తమ లక్ష్యాలను మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపైకి మళ్లిస్తామని ఇరాన్ హెచ్చరిస్తు న్నది. ఇదే జరిగితే అమెరికా కూడా ఘాటుగా స్పందించే అవకాశముంది.
ఇరువైపులా నష్టం!
ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ఆయుధ శక్తి ఉన్న అమెరికాతో సమరం అంటే ఇరాన్‌కు సవాలే. 2026లో అమెరికా సైనిక బడ్జెట్ పరిశీలిస్తే 1.01 ట్రిలియన్ డాలర్లు. 2027 నాటికి దీనిని 1.5 ట్రిలియన్ డాలర్లుకు పెంచే ప్రయత్నాల్లో అమెరికా ఉన్న ది. మరోవైపు 2024 లెక్కల ప్రకారం ఇరా న్ దేశ బడ్జెట్ 45 బిలియన్ డాలర్లు, అం దులో రక్షణ బడ్జెట్‌కు కేటాయించిన మొత్తం 10.3 బిలియన్ డాలర్లు మాత్రమే.
దీన్నిబట్టే ఆర్థికంగా, సైనికంగా అత్యంత బలోపేతంగా ఉన్న అమెరికాతో ఇరాన్ ఏమాత్రం సరితూగదని అర్థమవుతోంది. ఇప్పటికీ ప్రపంచ ఆధిపత్యానికి కోరలు చాస్తున్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కత్తిమీద సాము వంటిదే!. అయితే ఈ యుద్ధంలో గెలుపోటముల సంగతి పక్కనబెడితే, నష్టం మాత్రం ఇరు పక్షాలవైపు ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 9000481768




