28 February, 2026 | 6:07 AM

గాలిలో దీపంలా ఆహార భద్రత!

27-02-2026 12:00 AM

ముచ్చుకోట సురేష్‌బాబు :

ప్రజల ఆహారం సురక్షితంగా ఉండేలా చూడడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాథమిక బాధ్యత. ప్రజలు తాగే పాలు, వినియోగించే నెయ్యి సురక్షితమని నమ్మలేని పరిస్థితి వస్తే, పాలనపై అనేక ప్రశ్నలు తలెత్తడం సహజమే. భారత్‌లోని పాడి పశువుల ద్వారా గత ఆర్ధిక సంవత్సరం 247.8 7 మిలియన్ టన్నుల పాల దిగుబడి సాధించి ప్రపంచంలోనే అగ్రస్థానం లో నిలిచింది. గత ఆర్ధిక సంవత్సరం కూడా ప్రపంచంలో మొత్తం ఉత్ప త్తిలో దాదాపు 25 శాతం వాటాను భారత్ కలిగి ఉంది.

పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలు అగ్రభాగంలో ఉన్నాయి. 2033-- 34 నాటికి ఈ దిగుబడి మొత్తాన్ని 330 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దే శంలో 1970లో తలసరి పాల వినియో గం కేవలం 107 మీ.లీ కాగా ప్రస్తుతం సు మారు 471 మీ.లీగా వుంది. ప్రపంచంలో నే పాల ఉత్పత్తి, వినియోగంలోనూ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఉత్పత్తికి, వినియో గానికి మధ్య అంతరం చాలానే ఉంది.

ఫలితంగా పాల అవసరాన్ని అవకాశంగా చేసు కున్న కొందరు ఆర్జనే ధ్యేయంగా నకిలీ పాలు తయారు చేస్తుండడంతో కల్తీకి అ డ్డూ అదుపు లేకుండా పోతోంది. చూడ్డానికి పాలలాగే కనిపించినప్పటికీ వాటి పరి మాణం పెంచేందుకు యూరియా ,ఫార్మాలిన్, డిటర్జెంట్ల్లు, అమ్మోనియమ్ సల్ఫేట్, బొరిక్ యాసిడ్ ,కాస్టిక్ షోడా, సాలిసిలిక్ యాసిడ్, హైడ్రోజెన్ పెరాక్సుడ్, మెలనిన్ వంటి విష పదార్థాలను కలుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని కలుషితం చేస్తున్నారు.

కార్బోహైడ్రేట్‌తో పాల సాంద్రతను పెంచటంతో పాటు లాక్టో మీటర్ టెస్ట్‌తో కూడా గుర్తించలేని విధంగా పాలల్లో నీరు కలిసిపోతుం ది. దీనివల్ల కిడ్నీ, ఉదర సమస్యలతో పా టు క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఇలా వ్యాపారులు పాలతో ఆటలాడుతున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వాలు ప్రేక్షక పాత్రే వహిస్తున్నాయి.

ఏపీ ఘటన ఉదాహరణ..

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రభుత్వం నిర్మాణాలు ఏర్పాటు చేసినా ప్రజారోగ్యాన్ని కాపాడే కార్యాచరణ సామర్థ్యాన్ని మాత్రం నిర్మించలేదని స్పష్టమవు తోంది. నిత్యం  కల్తీపై మాట్లాడుతున్న  ప్ర భుత్వం, కల్తీని నిరోధించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడం విడ్డూ రంగా అనిపిస్తున్నది. ఏళ్ల తరబడి ఆల స్యం తర్వాత తిరుమలలో సుమారు రూ. 25 కోట్లతో అధునాతన ఎలక్ట్రానిక్ టంగ్, ఎలక్ట్రానిక్ నోస్ సాంకేతికతతో ఆహార పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చేశారు.

కాగితాలపై ఇది సాంకేతిక పురోగతిలా కనిపించింది. కానీ వాస్తవానికి ఇది తక్కువ సిబ్బందితోనే నడుస్తోంది. దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి గణనీయం గా తక్కువ మంది ఫుడ్ అనలిస్టుల మాత్ర మే ప్రభుత్వ సేవలో ఉన్నారు. తిరుమల ప్రయోగశాలలోనే ముగ్గురు అనలి స్టులు మాత్రమే పనిచేస్తున్నారని సమాచారం. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూ నివర్సిటీ, కాకినాడలోని ఆహార పరీక్షా ప్రయోగశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

ఈ ల్యాబ్ ఒకవైపు విద్యా కార్య క్రమాలు నిర్వహిస్తూ నియంత్రణ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. ప్రత్యే క నియంత్రణ వ్యవస్థను బలోపేతం చే యాల్సింది పోయి, ప్రభుత్వం తన బాధ్యతలో భాగాన్ని ఒక విద్యాసంస్థకు బదిలీ చేసినట్టైంది. ఫలితంగా ఖరీదైన పరికరాలు సరిగా వినియోగంలోకి రాకపోగా నమూనాలను పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

కల్తీదారుల్లో భయమేది?

రాజమహేంద్రవరంలో ఒకే సరఫరాదారుని నుంచి కల్తీ పాలు తీసుకున్న వంద కు పైగా కుటుంబాల ఘటనతో పరిస్థితి తీవ్రత వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మృతి చెందగా, పిల్లలు సహా మరికొందరు ఇంకా విషమ స్థితిలో ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా విషతత్వ నివేదికలు ఇతర ప్రాంతాల ల్యాబ్‌ల నుంచి రావాల్సి వచ్చింది. స్థానికంగా కలుషిత పదార్థాలు వెంటనే గుర్తించే సామర్థ్యం లేకపోవడం వల్ల నివారణ వ్యవస్థ మరణాల తర్వాత మాత్రమే స్పందించింది.

అధికారులు తరచుగా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ యూ నిట్లను పర్యవేక్షణకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇది ప్రాథమిక కల్తీలను మాత్ర మే గుర్తించగలవు. కానీ పురుగుమందు అవశేషాలు, యాంటీబయాటిక్‌లు, హెవీ మెటల్స్, అప్లాటాక్సిన్, హార్మోన్ కలుషితాలు వంటి సంక్లిష్ట పదార్థాలు గుర్తించ లేవు. ఇవి కేవలం ప్రాథమిక స్క్రీనింగ్ సాధనాలు మాత్రమే. ధృవీకరణాత్మక ప్ర యోగశాలలు లేకుండా చట్టపరమైన చర్య లు కష్టమవుతాయి. దీంతో కల్తీదారులు భయపడకుండా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతుంది.

నియామకాలెక్కడ?

అసలు సమస్య మానవ వనరుల్లో ఉం ది. అర్హత కలిగిన ఫుడ్ అనలిస్టుల నియామకాలు సంవత్సరాలుగా నిలిచిపోయా యి. అనేక పోస్టులు ఖాళీగా ఉండడంతో తగినంత సిబ్బంది లేకపోవడం, ఉన్న సి బ్బందికి ఆధునిక పరికరాలపై అవగాహనలేమి లేకపోవడం వెరసి పరీక్షలు పరిమిత ప్రమాణాలకే కుదురుతున్నాయి. ఫలితం గా పశువైద్య ఔషధ అవశేషాలు, యాంటీబయాటిక్ కలుషితం, పురుగుమందు అవశేషాలు వంటి ప్రమాదకర పదార్థాలు గుర్తించడంలో ఆలస్యమవుతుంది.

ల్యాబ్ లు ఉన్నా సమగ్ర పరీక్షలు లేవు. పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండటంతో నమూనాలను తరచూ రాష్ర్టం వెలుపల లేదా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపాల్సి వస్తోంది. జేఎన్‌టీయూ కాకినాడ ల్యాబ్‌పై అధిక భా రం పడుతోంది. నివేదికలు రావడానికి వారాలు, నెలలు పడుతున్నాయి. అప్పటికి కల్తీ ఉత్పత్తులు వినియోగంలోకి వెళ్లిపోవడంతో నష్టం జరిగిపోతున్నది. ల్యాబ్‌లను బలోపేతం చేయాలని పంపిన ప్రతిపాదనలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి

పట్టని ప్రజారోగ్యం!

ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నియంత్రణ వ్యవస్థ భవనాల సంఖ్యపై కాకుండా పరీక్షల వేగం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ధృవీకరణ కు నెలలు పడితే పర్యవేక్షణ ప్రభావం కోల్పోతుంది. నివారణ బదులు నష్ట ని యంత్రణకు వ్యవస్థ పరిమితమవుతుంది. ఆధునిక పరికరాలు ఉన్నా శిక్షణ పొందిన సిబ్బంది, సమయానుకూల పరీక్షా సామ ర్థ్యం లేనప్పుడు వినియోగదారులకు నిత్యావసర ఆహారంపై అనిశ్చితి నెలకొంటుంది. నియంత్రణ సంస్థల చర్యలు పరిమితమవుతాయి. బాధితులకు ఆలస్యంగా సహా యం అందుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆహార భద్రతా వ్యవస్థలో మౌలిక వసతులు ఉన్నా కార్యాచరణ సిద్ధత లేకపోవడం వల్ల ప్రజారోగ్యం గాలిలో దీపంలా తయారైందనే భావన పెరిగిపోయింది.

 వ్యాసకర్త సెల్: 9989988912