ఇరాన్ అధ్యక్షుడు మసూద్ రాజీనామా?
02-06-2026 12:00 AM
- ఐఆర్‌జీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి
- సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి లేఖ!
వాసింగ్టన్, జూన్ 1: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజస్కియాన్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ఐఆర్‌జీసీ దళాల తీరుపై తీవ్ర అసంతృప్తితో తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు సమచారం. ఈ మేరకు అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఇరాన్ పత్రిక వెల్లడించింది.
ఇరాన్ పాలన ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాలలో ఇరాన్ ప్ర భుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నట్లు ఆరోపించారు. మసూద్ పెజిష్కియా న్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెటినట్లు తెలిపింది.






