1 April, 2026 | 2:32 AM

అమెరికా టెక్ సంస్థలకు ఐఆర్జీసీ వార్నింగ్

01-04-2026 12:44 AM
  1. ప్రతీకార చర్యలుంటాయి

ఉద్యోగులు తమ కార్యాలయాలను విడిచిపెట్టాలి

ఇరాన్, మార్చి 31 (విజయక్రాంతి): ఇరాన్‌పై దాడులకు ప్రతీకారంగా అమెరికాలోని ప్రధాన టెక్నాలజీ సంస్థలను ఏప్రిల్ నుంచి లక్ష్యంగా చేసుకుంటామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌లో జరిపే ప్రతీదాడికి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబిఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 సంస్థలపై ప్రతీకార చర్యలుంటాయని ఇరాన్ ప్రకటించింది.

అమెరికా లక్ష్యాలను పర్యవేక్షించే సంస్థలను ఇకపై ఉపేక్షించబోమని తెలిపింది. ఉద్యోగులు తమ భద్రతను నిర్ధారించుకునేందుకు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా తన సైనిక కార్యకలాపాలకు త్వరితగతిన సమాచారాన్ని చేరవేసేందుకు ప్రసార సాంకేతికత (ఐసీటీ), కృత్రిమ మేథస్సు (ఏఐ)పై ఆధారపడింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా అమెరికా ఏఐ సాంకేతిక ఉపయోగించి పట్టుకున్నట్లు తెలుస్తుంది.  అమెరికా ఏజెన్సీలు ఉపగ్రహాలు అపారమైన సమాచారాన్ని సేకరిస్తాయి.