19 April, 2026 | 1:16 PM

సెల్‌ఫోన్ వెలుతురులో వైద్యమా?

01-06-2025 12:14 AM

జహీరాబాద్ ఏరియా దవాఖాన ఘటనపై హరీశ్ ఆగ్రహం

హైదారబాద్, మే 31 (విజయక్రాంతి): ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలోని జనరేటర్ పని చేయక, చివరకు సెల్‌ఫోన్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ చేశారు.

నిత్యం 300 మందికి పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితే ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమ వతుందన్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలన పడకేసిందని, పేదలకు సరైన వైద్య సేవ లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గాలిలో మెడలు కట్టడం మాని, కనీస సౌకర్యాలు కల్పించాలని చురకలంటించారు.