మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా...?
కస్టడీ పేరుతో వేధింపులు చేయడం ప్రభుత్వానికి సరికాదు: బిఆర్ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి ఏమైనా టెర్రరిస్ట్రా.. లేదా కరడు కట్టిన ఉగ్రవాదా... కస్టడీ పేరుతో అతడిని ప్రభుత్వం వేధించడం సరికాదని జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి దత్తాత్రేయ విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పైలెట్ రోహిత్ రెడ్డి కేవలం ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే మాత్రమేన్నారు.
ఒక టెర్రరిస్టుకైనా ఇన్నిసార్లు కస్టడీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఈ చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా దీటుగా అధికార కాంగ్రెస్ పార్టీకి పైలెట్ ఆధ్వర్యంలో ఎదుర్కున్నదని అది జీర్ణించుకోలేకనే అతడిపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎవరు ఐతే యాక్టివ్ గా ఉంటారో అలాంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల పై కేసులు బనాయిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.




