5 April, 2026 | 9:07 PM

దళిత హక్కుల మహానేత, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్

05-04-2026 04:38 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దళిత హక్కుల మహానేత, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంబాలపల్లి వెంకటయ్య కొనియాడారు. ఆదివారం 119వ జయంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1907 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో జన్మించారు. బాబు జగ్జీవన్ రామ్ సాధారణ కుటుంబం నుండి ఎదిగి దేశ రాజకీయాల్లో అగ్రస్థానాన్ని అందుకుని, స్వాతంత్ర్య సమరంలో విశేష సేవలు అందించిన మహానుభావుడని కొనియాడారు.

దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతదేశంలోని దళిత వర్గాల హక్కుల కోసం పోరాడాడు. అతను 1971-1977 మధ్య భారతదేశ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. 1942లో 'దళిత వర్గాల సమాఖ్య' స్థాపించాడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, అరేకంటి యేసయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొండ్రపల్లి రమేష్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు పొట్ట ప్రభు, మద్దిమడుగు నవీన్, అంకూరి హరీష్, అంకూరి శివ, జనసేన చందు వివిఆర్ తదితరులు పాల్గొన్నారు.