2 July, 2026 | 12:28 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

కబ్జాకోరల్లో గంగరేణి కుంట?

12-06-2025 12:09 AM
  1. కనుమరుగవుతున్న కుంటలు, వాగులు
  2. చెలరేగి పోతున్న అక్రమార్కులు 
  3. పట్టించుకోని అధికారులు

హుజురాబాద్,జూన్11: (విజయ క్రాంతి)  రాష్ట్ర ప్రభుత్వం కుంటలు చెరువులు కాపాడేందుకు హైడ్రా పేరుతో ప్రత్యేక వింగు ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పట్టణాల లో పల్లెల్లో కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతునే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజరా బాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో 27 గుంటల విస్తీర్ణం గల గంగ రేణికుంంట కబ్జా దారుల చేతులకు వెళ్లనుందా? కుంట పక్కనే ఉన్నవారు జ రుపుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని స్థానికులు అంటున్నారు. 

పూర్వం గంగా రేణికుంటకు హుజురాబాద్ మండలం పెద్ద పాపాయ పల్లి గ్రామం లోని మూలకుంట వాగు నుండి కాలువ ద్వారా నీరు చేరేదని తెలిపారు. ఈ కుంటకింద సుమారుగా 150 ఎకరాలకు పారకం ఉండేదని, వ్యవసాయ బవులలో నిత్యం నీరు నిండికుండలా ఉండేవని , కాలువ కనుమరుగు కావడంతో కుంటలోకి నీరు చేరక ఎండిపోతుందని తెలిపారు.

ఈ కుంట నుండి చిలకా వాగులోకి నీరు చేరేదని. ఇది పూర్తిగా కబ్జా కావడంతో ఎండిపోయి పిచ్చి చెట్లు వేపుగా పెరిగాయి. మూడు రోజుల క్రితం కబ్జాదారులు పొలం చదును పేరుతో కుంటను సైతం చదును చేశారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి కబ్జాకార్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

కబ్జాదారుల పై చర్యలు తీసుకుంటాం

 చెరువులు వాగులు కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హుజురాబాద్ ఎమ్మార్వో కనకయ్య అన్నారు. చెరు వులో కుంటలు వాగులు సర్వే చేయించి వాటికి హద్దులు ఏర్పాటు చేస్తాం.

 తహసీల్దార్ కనకయ్య