calender_icon.png 18 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదమరిస్తే అధోగతే?

18-11-2025 12:22:43 AM

రోడ్డెంట పొంచి ఉన్న మృత్యువు..!

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం నుంచి వెంకటగిరి మీదుగా నెక్కొండ ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై రోడ్డు పక్కనే వ్యవసాయ బావుల రూపంలో మృ త్యువు పొంచి ఉంది. ఈ రహదారిపై ఏమా త్రం ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం పొంచి ఉంది. కేసముద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రెండు బావులు ఎదురెదురుగా రోడ్డుకు పక్కనే ఉన్నాయి. అలాగే వెంకటగిరి నుండి ఇంటికన్నె మార్గం లో రెండు చోట్ల రోడ్డుకు ఆనుకొని వ్యవసాయబావులు ఉన్నాయి.

ప్రమాదకరంగా ఉ న్న బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దీనితో వ్యవసాయ బావులు ఉ న్నచోట ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న బెంగతో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట ఈ రోడ్డు వెంట ప్రయాణం అగమ్య గోచరంగా మారింది. బైపాస్ రోడ్డు సమీపంలో కూడా రోడ్డు వెం ట వ్యవసాయ బావుల రూపంలో మృత్యు వు పొంచి ఉంది. రోడ్లను విస్తరించిన ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న బావుల వద్ద రక్షణగా గైడ్ వాల్ నిర్మించకుండా వదిలేశారు. బైపాస్ రోడ్డులో రోడ్డు వెంట ఉన్న బావిలో గతంలో ఒక కారు పడి ముగ్గురు మరణించారు. 

వెంకటగిరి మార్గంలో రోడ్డును డబుల్ రోడ్డు గా విస్తరించడంతో వ్యవసాయ బావులు రోడ్డు కు ఆనుకొని ఉండడంతో ప్రమాదం ఈ క్షణంలోనైనా జరిగే పరిస్థితి నెలకొంది. రోడ్ల వెంట ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావుల వద్ద రక్షణగా గైడ్ వాల్ లేదంటే స్టీల్ బారికేడ్ ఏర్పాటుచేసి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.