హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
15-08-2024 12:46 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. అజయ్‌కుమార్ భల్లా స్థానంలో గోవింద్‌ను నియమించారు. భల్లా 2019 నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కొనసాగారు. ఈ నెల 22న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. గోవింద్ మోహన్ 2021 అక్టోబర్ నుంచి సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రటరీగా, అడిషనల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు.




