calender_icon.png 7 June, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్క్ పార్టీ పెట్టేనా?

07-06-2025 12:00:00 AM

  1. కుబేరుడి రాజకీయ ఆరంగ్రేటంపై జోరుగా ఊహాగానాలు
  2. ఇటీవల ట్రంప్‌తో చెడ్డ స్నేహం
  3. ఇప్పటికే డోజ్ నుంచి వైదొలిగిన మస్క్
  4. బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్ విషయంలో విబేధాలు
  5. ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్న మస్క్

వాషింగ్టన్, జూన్ 6: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారా? అని జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే డోజ్ నుంచి వైదొలిగిన మస్క్ అమెరికా అధ్యక్షుడితో విభేదిస్తూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్’ ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి బంధానికి బీటలు వారాయి.. ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఆర్థిక సంస్థలకు అందించే సబ్సిడీలను పెద్ద మొత్తంలో తగ్గించనుంది.

ఈవీ కంపెనీలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఆగిపోనున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌పై మస్క్ ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఇప్పటికే అధ్యక్షుడిపై అనేక ఆరోపణలు చేస్తూ.. తను లేకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదంటూ వ్యాఖ్యానించారు. ఇక మస్క్ వ్యవహార శైలితో తాను విసిగిపోయానని ట్రంప్ ప్రకటించారు. 

పోల్‌కు అనూహ్య స్పందన

ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో కొత్త పార్టీ పెట్టేందుకు సమయం ఆసన్నమైందా? అని పోల్ పెట్టారు. ఈ పోల్‌కు మస్క్‌కు ఉన్న రెండు మిలియన్ల ఫాలోవర్లలో 80శాతం మంది మద్దతు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అనేక సంఖ్యలో రాజకీయ పార్టీలున్నప్పటికీ దేశం మొత్తం పలుకుబడి ఉన్న రాజకీయ పార్టీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. చాలా మంది ఫాలోవర్లు కొత్త పార్టీ పెట్టాలని మస్క్‌కు సూచించగా.. మరికొంత మంది లిబర్టేరియన్ పార్టీకి మద్దతివ్వాలని తెలిపారు.