calender_icon.png 5 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నజరానా అందేనా?

05-12-2025 02:05:05 AM

 ఏకగ్రీవాలకు ప్రోత్సాహమేది

కరీంనగర్, డిసెంబరు 4 (విజయ క్రాంతి): ప్రభుత్వం ఏదున్నా ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నికయిన గ్రామ పంచాయతీ లకు నజరానాలను ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఆచరణలో అమలు చేయకపోవడంతో ఈ నజరానాలపై నమ్మకం సన్నగిల్లిం ది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

ప్రభుత్వం 10 లక్షల రూపాయ లు ప్రకటించడంతోపాటు తమవారు గెలిస్తే 10 లక్షల నజరానా ఇస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించడం, అధికార పార్టీకి చెందిన మాన కొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయ ణ ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు తాను కూడా 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఈసారైనా ఈ ప్రకటనలు కార్య రూపం దాలుస్తాయా చూడాలి. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 106 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లి జిల్లాలో 13, జగిత్యాలలో 37, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల రూ పాయల నజరానా ప్రకటించింది. అప్పటి సర్పంచులు కొందరు 5 లక్షల రూపాయలు వస్తాయన్న ఆశతో అత్యవసర పనులను పూ ర్తి చేశారు. అయితే నేటికి ఆ నజరానాలు అందలేదు. పాలకవర్గ పదవీకాలం 2024 జనవరితో ముగిసినప్పటికీ అప్పటి పాలకవర్గానికి రూపాయి కూడా రాలేదు.

పలుమా ర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం దక్కలేదు. ఈసారి మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఉమ్మడి జిల్లాలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం దేశాయిపేట, పెద్దకుర్మపల్లి, రామడుగు మండలం శ్రీరాములపల్లి ఉండగా, పెద్దపల్లి జిల్లాలో నాలుగు గ్రామాలు మంథని మండలం నా గారం, తోటగోపయ్యపల్లి, బైతుపల్లి, రామగిరి మండలం చందనాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్, రామాపూర్, కథలాపూర్ మండలం రాజారంతండా, మెట్పల్లి మండలం చింతలపేట పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 గ్రా మాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని చింతమణితండా, రూప్లానాయక్ తండా, వీ రునితండా, అడ్డబోరెతండా, బడితండా, కా యిదిగుట్ట, కుమ్మరిపేట, జైసేవాలాల్ తండా లు ఏకగ్రీనమయ్యాయి. ఇవేకాకుండా 209 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. రెండు, మూడు విడతల్లో కలుపుకుంటే ఈసారి కూ డా ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య సెంచరి దాటే అవకాశముంది. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం 5 లక్షల నజరానా ప్రకటించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. రేవంత్ సర్కారయినా మాట నిలబెట్టుకుంటుండా, కాలవెళ్లదీస్తుందాచూడాలి.