ఆర్మీ అంటే అంత చులకనా?
- రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి దొందూ దొందే
- బేషరతుగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
- కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 2 (విజయ క్రాంతి): ఢిల్లీలో బడేమియా రాహుల్ గాం ధీ, గల్లీలో ఛోటేమియా రేవంత్‌రెడ్డి దొందూ దొందేనని, ఆర్మీ అంటే వాళ్లిద్దరికీ ఎప్పుడూ చులకన భావమే అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా గే మాట్లాడారని విమర్శించారు. సైనికులను ఉద్దేశించి వ్యగ్యండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సీటు రక్షించు కోవడం కోసం రేవంత్‌రెడ్డి నెహ్రూ కుటుం బ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు కనిపిస్తుంద న్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. ఆర్మీని కించప రచడంలో బీఆర్‌ఎస్ కూడా మునుగోడు ఎన్నికలు జరిగాయని, అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
అద్దెకు మజ్లిస్ అభ్యర్థి!
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాం గ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తోందని, ముఖ్యంగా సీఎం రేవం త్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ మోసం చే స్తున్నారన్నారు. మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా.. అజారుద్దీన్‌కు మం త్రి పదవి ఇచ్చినా.. గెలుస్తామో లేదోనన్న అనుమానం, భయంతో బెదిరింపులకు దిగుతోందన్నారు. ఎన్నికల ప్రకటన జరిగిన రోజే మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు మెహిదీ పట్నంలో ఖబరస్థాన్ కోసం విలువైన ఆర్మీ స్థలాన్ని కేటాయించడం, ఎర్రగడ్డ కాలనీల మధ్య, బస్తీల మధ్య మరో స్థలాన్ని ఖబర స్థాన్‌కు ఇవ్వడం, ఇతర తాయిలాలతో ము స్లింలను బుజ్జగిస్తూ.. ఇతర వర్గాలను మా త్రం బెదిరిస్తోందని విమర్శించారు.
సన్న బియ్యంపై కేంద్రం రూ.42 ఖర్చు పెడుతోం దని, రాష్ర్ట ప్రభుత్వం మాత్రం కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తోందన్నారు. ధైర్యం ఉంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసి చూపించాలని, రేవంత్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. మహిళలకు రూ.2 వేలు, స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, పొదు పు సంఘాలకు రూ.5 లక్షలు, బీసీ సంక్షేమా నికి లక్ష కోట్లు ఇవ్వకుండా.. అమల్లో ఉన్న పథకాలను రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నా రంటే కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటో అర్థం అవుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్ని క ల్లో ఒక వర్గానికి సంబంధించి పెద్దలతో సమావేశమై, వారికి భూములు, మంత్రి పదవి ఇస్తారు, మరీ వేరే వర్గానికి చెందిన వారి ఓట్లు అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.






