calender_icon.png 3 November, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనమే బలంగా ఉన్నాం

03-11-2025 02:22:39 AM

అయినా నిర్లక్ష్యంగా ఉండొద్దు 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్‌చార్జిలు, మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం 

కేకే సర్వేను పట్టించుకోవద్దని సూచన 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంద ర్భంగా వస్తున్న సర్వేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మొద్దన్నారు. క్షేత్రస్థాయిలో మన మే బలంగా ఉన్నామని, అయినా నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఎవరి డివిజన్‌పై వారు దృష్టి పెట్టాలని సూ చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఇన్‌చార్జి మంత్రులతో సీఎం రేవం త్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో లంచ్ మీటింగ్  ఏర్పాటు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు.

జూబ్లీహిల్స్ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూ హాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సెగ్మెంట్‌లో కేకే సంస్థ నిర్వహించిన సర్వే పై  రాజకీయ వర్గాల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా బీఆర్‌ఎస్ కల్పిత సర్వే అని కాంగ్రెస్ కొట్టిపారేస్తుంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలనే ఈ సర్వే సంస్థ వెల్లడించిందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఈ నేప థ్యంలో వస్తున్న సర్వేలన్ని ఫేక్ అని వాటిని విస్వసించకుండా ప్రజాక్షేత్రంలో పని చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

కేకే సర్వేపై ఆర్వోకు ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల నాడికి అనుగుణంగా పార్టీలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో కేకే సర్వే రాజకీ యంగా తీవ్ర దుమారం రేపుతోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో విజయావకాశాలు ఎవరిపైవు ఉన్నాయంటూ తాజాగా సర్వే నిర్వహించి ఆ వివరాలను కేకే సర్వే సంస్థ బయటపెట్టింది. ఈ సర్వేలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైపు మొగ్గు ఉన్నట్లు చూపించారు. అయితే ఈ సర్వే అంతా అబద్ధం అని బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా ఈ సర్వే చేపట్టిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ మేరకు ఈ సర్వేపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తన అనుచరులతో కలిసి ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బల్మూరి వెంకట్.. ఎన్నికలకు ముందే ఓటర్లను ప్రభావితం చేయడానికి బీఆర్‌ఎస్ ఈ రకమైన సర్వేలు చేస్తోందని దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్ గత పదేళ్లలో చేసిన పనులను ప్రచారం చేసుకోవాలని అంతే తప్ప ఓడిపోబోతున్నారని తెలిసి ఇలాంటి దొంగ సర్వేలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఏమిటని నిలదీశారు. గతంలో హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేకే సర్వేకు పూర్తిగా భిన్నమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకోకుండా ఇంట్లో కూర్చుని ఈ సర్వే చేశారని ఆరోపించారు.