8 July, 2026 | 7:53 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

మద్యం సేవించి వాహనాలు నడపరాదు

17-09-2025 12:04 AM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజ్ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రబాను సూచనలతో  ఇల్లందు ఎస్హెచ్ఓ  తాటిపాముల సురేష్, ఎస్సై హసీన పోలీస్ సిబ్బంది పలు సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ... మద్యం సేవించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని ఆరోగ్యనికి నష్టం జరుగుతుందని లివర్ ప్రాబ్లం గుండె జబ్బులు మెదడు పనితీరు మందగించడం జరుగుతుందని మద్యం తాగిన తర్వాత వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, కుటుంబ కలహాలు జరుగుతాయని ఆర్థికంగా నష్టం జరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.

యువత భవిష్యత్తు దెబ్బ తినడం చదువు ఉద్యోగం జీవిత లక్ష్యాలు నాశనం అవుతాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండి మీరు మద్యం సేవించకపోతే పిల్లలు కూడా దూరంగా ఉంటారని, మంచి జీవన విధానం కోసం మద్యం నుంచి దూరంగా ఉండి కుటుంబం ఆనందంగా సమాజం శాంతిగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలని కోరారు.