14-01-2026 12:45:31 AM
జిల్లా, గ్రామీణ కమిటీ నియామకాల్లో పక్షపాతం..
ఒకరిద్దరి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి బారి నష్టం
ఇలాగే కొనసాగితే రానున్న కార్పోరేషన్ పీఠం గల్లంతే
హనుమకొండ,జనవరి 13 (విజయ క్రాంతి):అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నేతల పరిస్థితి. కేంద్రంలో ము చ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ఇంకనూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జి ల్లాల్లో కమిటీలు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. పట్టణాల కే పరిమితం అనే పేరు ఉన్న కాషాయ పార్టీ, క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాషాయంపై జనాదరణ పెరుగుతున్నా, జనాల్లో నిలబెట్టుకునే నేతలే కరువైనట్టు గా కనబడుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే కమిటీల విషయంలో కాషాయం విధానాలు గాడి తప్పినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు, నిన్న పరకాల స మావేశంలో తార స్థాయికి చేరుకున్నట్టు గా కనబడ్డాయి. ఆరుపదులు గా ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాల పరిస్థితులను గమనిస్తే వరంగల్ మేయర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ గా గెలిచిన పరిస్థితులు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. రోజు రోజుకు అభివృద్ధి చెందాల్సిన పార్టీ ఏడాదికో తీరు చిన్నాభి న్నం అవుతూనే ఉంది.
ఉమ్మడి ఆంధ్ర ప్ర దేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన పుష్కరకాలంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వర కు నేతల విధానంలోనే లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అధ్యక్షులు మారినా, నేత లు మారినా బిజెపికి విజయ అవకాశాలు తక్కువగానే తీసుకొచ్చినట్టుగా అర్థం అవుతుంది. వరంగల్ జిల్లాలో తాజాగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే గ్రామస్థాయి నుం చి జిల్లా స్థాయి వరకు అదే విధానం ఉందన్నదీ జగమెరిగిన సత్యం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బిజెపి ఊపు కనిపించినా ఫలితాలు చేజిక్కించు కోవడంలో పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు సంవ త్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం నేతల మధ్య సైయోధ్య లేకపోవడంతోనే ఓటమి పాలయిందని పార్టీ శ్రేణులు ఒప్పుకుంటున్నారు. పార్టీలో సీనియర్ కార్యకర్తలు, జూనియర్ కార్యకర్తలు ఎవరో ప్రక్షా ళన లేకుండానే పదవులు కట్టబెట్టడం పార్టీ ఓటమి కారణమని ఒప్పుకుంటున్నారు. సీనియర్ కార్యకర్తలను నాయకులను పక్కనపెట్టి వలస వచ్చిన కార్యకర్తలకు పదవులు ఇవ్వ డం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సంక్షేమ పథకాలను, ప్రజా సమస్యలపై పోరాటాలు జనాల్లోకి తీసుకెల్లడంలో జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకుల లోపమేనని అంటున్నారు.
అరకొర కార్యక్రమా లతో పేపర్ ప్రకటనలకే పరిమితమైతే ఫలితాలు ఇలాగే ఉంటాయని వాపోతున్నారు. పార్టీ విధానాలను పక్కనపెట్టి ఒకరిద్దరి వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకెళ్తే పార్టీ ఎలా బలపడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీనియారిటీ ప్రకారం, కమ్యూనిటీ ప్రకారం కార్యకర్తలను నేతలను పరిగణలోకి తీసుకొని పార్టీలో సముచిత గౌరవం కల్పించినప్పుడే పార్టీ బలపడడమే కాకుండా ముందుకెళ్తుందని సూచిస్తున్నారు. లేని పక్షంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం అందని ద్రాక్షగానే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను యోగించడం లో ప్రస్తుత ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడమే ఇందుకు కారణమని,పార్టీ నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని కష్టపడే కార్యకర్తలకు సముచిత గౌరవాలను కల్పిస్తేనే పార్టీకి పురోగతి సాధ్యమని అభిమానులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కాషాయ సైనికుల కల,కలగానే మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.