03-02-2026 12:36:39 AM
నాలుగు రోజుల్లోనే 70 సంస్థల్లో తనిఖీలు పూర్తి
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అగ్ని ప్రమాదాలు, వాటి వల్ల సంభవించిన ప్రాణ నష్టా న్ని తెలంగాణ అగ్నిమాపక శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు ఫైర్ అధికారులు ఓఆర్‌ఆర్ పరిధిలోని భవనాల్లో యుద్ధ ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ చేప ట్టారు.
భవనాల్లోని సెల్లార్లను పార్కింగ్ కో సం కాకుండా అక్రమంగా నిల్వ గదులుగా గోడౌన్లు వినియోగిస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించారు. సెల్లార్లలో వాచ్మెన్ కుటుంబాలు లేదా పనిమనుషులను నివసింపజేయడం అత్యంత ప్రమాదకరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించు కోవడానికి కీలకమైన మెట్ల మార్గాలు, ర్యాంపులను సామా న్లతో అడ్డగించడం, నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున వస్తువులను డంప్ చేయ డం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో జనవరి 28 నుంచి ఇప్పటివరకు మొత్తం 70కి పైగా సంస్థలను ఫైర్ అధికారులు తనిఖీ చేశారు. ప్రతి భవనంలోనూ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, ఎక్స్టింగ్విషర్లు, స్ప్రింక్లర్లు సక్రమంగా పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. లోపాలు కనిపిస్తే చట్టపరమై న చర్యలు తప్పవన్నారు.