calender_icon.png 3 February, 2026 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి

03-02-2026 12:35:56 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జిని సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ సోమవారం ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఘట్ కేసర్ పట్టణంలో 17 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రజా ప్రతినిధులు, అధికారులచే ప్రారంభించిన రైల్వే బ్రిడ్జి నేటికి పూర్తి కాకపోవడంతో పట్టణ ప్రజలు, వాహనాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఘట్ కేసర్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళుటకు, రావడానికి అంతర్ జిల్లా బస్సలు పట్టణంలోకి రాకపోవడం వలన ఓ.ఆర్.ఆర్ వద్ద నుండి పట్టణంలోకి రావడం మహిళలు, వృద్ధులు, పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కేశపట్నం ఆంజనేయులు పంతులు, నాగభూషణం చారి,సత్యనారాయణ, కొత్తకొండ వెంకటేష్, బర్ల దేవేందర్, అహ్మద్, మనుక కుమార్, కుతాడి రవీందర్, శివరాత్రి రాజు, తన్నీరు హరీష్, అబ్బసాని ప్రవీణ్, సార శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, గoడూరి సురేష్ పాల్గొన్నారు.