ముందుచూపు వుండదా?

02-05-2024 12:10:00 AM

కొవిషీల్డ్ (కొవిడ్) వాక్సిన్‌తో ప్రమాకరమైన మరో అరుదైన వ్యాధి (టిటిఎస్: థ్రాంభోసిస్ విత్ థ్రోంబో సైటోపీనియా) సోకే ప్రమాదం ఉందంటూ వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్ సమయంలో ఈ వాక్సిన్‌ను అనేక మంది వివిధ డోసులు గా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లందరి పరిస్థితి ఏమిటి? బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ‘ఆస్ట్రాజెనికా’ దీనిని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిద్వారా శరీరంలో రక్తం గడ్డ కడు తుందని, ప్లేట్‌లెట్ల సంఖ్యకూడా తగ్గగలదని, ఈ లక్షణాలు యువకులలో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. కోర్టు వ్యాజ్యం తర్వాతే పై కంపెనీ ఈ మేరకు నిజమేనని ఒప్పుకున్నది. దీన్నిబట్టి, ఔషధ కంపెనీలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతున్నది. అంతర్జాతీయంగా ఇలాంటి సందర్భాలలో చర్యలు ఏమీ వుండవా?

సూర్యతేజ, రాయలాపూర్