2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

సమస్యలు చెప్పుకునే అవకాశం లేదా?

30-04-2025 12:00 AM

అంగన్‌వాడీలకు ‘మే’ నెల సెలవులు ఇవ్వాలి 

మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వెళ్లడం తోపాటు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని కోరడానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంపూర్ణ, స్నేహ బిందు హైదరాబాద్ వెళుతుంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం సరైనది కాదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు అన్నారు.

అంగన్వాడి సమస్యల పరిష్కారం పై ఇప్పటికే పలుమార్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలో నిర్వహించినప్పటికీ స్పందన లేకపోవడంతో మంత్రి దృష్టికి తమ సమస్యలను విన్నవించడానికి మంగళవారం వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదన్నారు.

ఎండల తీవ్రత నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించారని, అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు కోశాధికారి సమ్మెట రాజమౌళి, పట్టణ కన్వీనర్ కుమ్మరి కుంట్ల నాగన్న ఉన్నారు.