2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు లేదని ఆత్మహత్యాయత్నం

30-04-2025 12:00 AM

వెలుగుపల్లి లో వాటర్ ట్యాంకు ఎక్కిన కనకయ్య

తుంగతూర్తి , ఏప్రిల్ 27:  పేద ప్రజల ప్రయోజనార్ధము ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభు త్వం పథకం ప్రవేశపెట్టగా ఒకపక్క అధికా రుల నిర్లక్ష్యం, మరొక ప్రక్క ఇందిరమ్మ కమిటీల నాయకుల అవినీతి తీరుతో, లిస్టులో పేరు నమోదు కాకపోవడంతో  పాటు నాయకులు చేతిలో మోసపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చే సిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడంతో నీటి ట్యాంకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకునే యత్నం చేయగా పోలీసులు కాపాడారు. ఈ విషయంపై బాదితుడు మాట్లాడుతూ  ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తన ఇళ్లు కోసం మొదటి దఫలో రూ. 20 వేటు లంచం ఇచ్చానని  లిస్టులో పేరు లేకపోవడంతో మోసపో యానని ఆవేదన వ్యక్తం చేశారు.