ఈ పోరాటం సరిపోతుందా?
మాడభూషి శ్రీధర్ :
అంతర్జాతీయ మహిళల దినోత్సవంలో స్త్రీ చైతన్యం గురించి ఆలోచించడం, అందుకు కావలసిన చర్యలు ఏమిటో నిర్ణయించుకోవలసి ఉంది. మహిళల సమానతకోసం 1948నుంచి రాజ్యాంగ సభ పోరాడింది. మహిళా వికాసానికి హిందూ కోడ్‌ను అంబేద్కర్ స్వయంగా పరిశోధించి నిర్మించారు.
రాజ్యాంగం నిర్మాణానికి అంబేద్కర్ కీలకమైన అధ్యక్షుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందూ కోడ్ బిల్లు ద్వారా సంస్కరణ ఉద్యమ సామాజిక విప్లవానికి ప్రారంభించింది ఆయనే. సామాజిక పితృస్వామ్య సోపానక్రమానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో ప్రముఖమైన పాత్ర అంబేద్కర్‌దే.
హిందూ కోడ్ బిల్లుకు అనుకూలంగా డాక్టర్ అంబేద్కర్ చేసిన వాదనలు మంత్రివర్గం నుండి ఆయన రాజీనామాకు దారితీశాయి. అంబేడ్కర్ రాజ్యాంగానికి ముందు హిందూ కోడ్ నిర్మించారు. చాలామంది వ్యతిరేకించారు. బిలుప్లు చర్చించారు. తిరస్కరించారు. చాలా వరకు హిందూ కోడ్‌లో ఆయన చేర్చిన అంశాలు తొలగించడం సాధ్యం కాని అంశాలని అర్థమైంది.
హిందువుల నిర్వచనం, కుల వ్యవస్థను తొలగించింది. హిందూ కోడ్ ముస్లిం, పా ర్సీ, క్రైస్తవుడు లేదా యూదులు కాని ఎవరికైనా వర్తిస్తుంది, అందరికీ యూనిఫాం కోడ్ ఇది. కాని అందరూ ఒప్పుకుంటారా? మరికొన్ని ప్రధానమైన సంస్కరణలు హిం దూ వివాహానికి సంబంధించినవి. అదిగా క దత్తత కోసం చాలా సమగ్రంగా నియమాలు తయారు చేసారు అంబేద్కర్. ఆ రకంగా మహిళలు, బాలబాలికల సంక్షే మం గురించి చాలా ఆలోచించారు.
హిందూ కోడ్‌లో కీలక అంశాలు
వీటన్నింటికీ మించి ఉమ్మడి-కుటుంబ ఆస్తి, దానిపై విధానం, మహిళలకు సాంప్రదాయేతర ఆస్తి కేటాయించడం కూడా చాలా వివాదాస్పదమైంది. మన హిందూ శాస్త్రాల ఆధారంగా అమలులో ఉన్న మి తాక్షర, దాయభాగ రకాల ఆస్తి సంక్రమణ, తదితర అంశాలను, వీలునామా ద్వారా మార్చే ఆస్తి వివరాలు అన్నీ సమస్యాత్మకమే. వీలునామా లేని సందర్భాలలో ఆస్తి వారసత్వం ఏ విధంగా పంచుకోవాలనేవి కూడా సంక్లిష్టమైనవి.
మన మహిళల స్వయం ప్రతిపత్తి, స్వా తంత్య్రం, అనే హక్కులు ఉన్నాయా లేవా అని అనుమానమే కదా. మగా ఆడ అనే మాట సంబంధం లేకుండా వీలునామా చేయకుండా మరణించే హిందువు ఆస్తి హక్కు ఎప్పుడొస్తుందో మొదట్లో సాధ్యం కాలేదు. మగవారికి మహిళల ఆస్తికి సం బంధించిన విధానాలు వేరుగా ఉన్నాయి. స్త్రీధన, వారసత్వ ధనం అదో పెద్ద చరిత్ర వివాదం, కోర్టులో కూడా తేలవు. వారస త్వం, నిర్వహణపై విధానాలను కోడ్ త యారు ఏర్పాటు చేశాయి.
అంబేద్కర్ కోడ్ మహిళలను సమాన పౌరులని గుర్తించింది, వారి వ్యక్తిత్వం దెబ్బకుండా ఆపాలని కోరిక. మహిళలకు ఆస్తిపై హక్కు లేకపోవడం తీవ్ర లోపం. లింగ ఆధారిత అణచివేత కుల-ఆధారిత అణచివేతతో ముడిపడి ఉంది. కులం, బ్రా హ్మణ పితృస్వామ్యం అవగాహన అర్థం కావాలి. కనుక సంస్కరణ అవసరమైంది. కోడ్ క్రోడీకరణ అవసరం. దీనితో మతపరమైన పునాది ఉందని అంబేద్కర్ పదే పదే చెబుతూనే ఉన్నా ఇంకా చాలా మం ది అర్థంచేసుకోవాలి.
సంస్కరణపై పార్లమెంట్ చర్చ
నెహ్రూ ముందు ఒప్పుకున్నా సామాజిక, చారిత్రక, రాజకీయ కారణాలతో అది వెనుకబడింది. రాజ్యాంగ నిర్మాణంలో సాధ్యమైనా హిందూ బిల్లు గెలవడం కష్టం అని నెహ్రూకు తెలిసింది. వివాహం, విడాకులకు సంబంధించిన మొదటి 55 నిబంధనలతో మాత్రమే తాము పోటీ చేస్తామని, మిగిలిన వాటిని మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత పార్లమెంట్ పరిశీలిస్తుందని నెహ్రూ రాజ్యాంగ సభకు చెప్పారు.
పార్లమెంట్ చేసిన మార్పులు అంబేద్కర్‌కు నచ్చలేదు. మళ్లీ మితాక్షర ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తిరిగి స్థాపించడం, సోదరులు కుమా ర్తెల వారసత్వ వాటాను కొనుగోలు చేయడానికి అనుమతించే సవరణ, వివాహం అయిన మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే విడాకులను అనుమతించే నిబంధన వంటి విమర్శకుల డిమాండ్లకు అనుగుణంగా ఉన్న కొత్త ముసాయిదాను నెహ్రూ అంబేద్కర్ కమిటీ ద్వారా పంపిణీ చేయించారు. బిల్లులు మళ్ళీ అసెంబ్లీలో ఓడిపోయిన తరువాత, అంబేద్కర్ రాజీనామా చేశారు.
విడాకులకోసం న్యాయ పోరాటం
ఓసారి పెళ్లయిన తరువాత ఆ బంధానికి మోక్షం అసలు దొరికే అవకాశమే లే దు. ఈ బిల్లులోని ’కోడ్ అప్లికేషన్’ హిందువులెవరనే ప్రశ్నతో ఈ చర్చ ముఖ్యమైంది. ఈ క్లాజ్‌లో హిందువులతో పాటు బౌ ద్ధులు, జైనులు, సిక్కులకు కూడా కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు లేదా యూదులకు వర్తించదు. ఈ క్లాజ్‌ను పార్లమెంటులోని చాలామంది సభ్యులు వ్యతిరేకించారు. ఇ దే వివక్షకు ఆధారమని విమర్శించారు. అ దే ఉండాలనే వారు చాలా ఎక్కువమందే.
హిందూ వివాహ చట్టం, 1955లో 13బి సెక్షన్ ద్వారా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత, 18 నెలల తర్వాత, కోర్టు విడాకుల డిక్రీ ఇచ్చే అవకాశం ఉంది.
పిటిషన్‌లో ఇద్దరూ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కా లం విడిగా ఉంటున్నారని, కలిసి ఉండలేకపోతున్నారని, విడాకులు తప్పదని అం గీకారం చేసుకున్నారని చెప్పాలి. కోర్టు, పిటిషన్‌లో చెప్పిన విషయాలన్నీ నిజంగా ఉన్నాయని నిరూపించుకుని, విడాకుల డిక్రీ ఇస్తుంది.
కుమార్తెలకు సమాన హక్కులు
మరో కేసు వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అండ్ ఓఆర్‌ఎస్.ఎయిర్ 2020 ఎస్ సీ 3717. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ తీర్పు. 2005లోచేసిన గొప్ప సవరణ ఇది. అయితే ఈ చట్టసవరణకు ముందు పరిస్థితులను వెనుక తేదీనుంచి మార్చుకోవచ్చా లేదా అనే అంశం పైన సుప్రీంకోర్టు ము ఖ్యమైన తీర్పు ఇచ్చింది.
తీర్పు వివరాలు ఏమిటంటే హిందూ వారసత్వ చట్టం, 1956లోని ప్రత్యామ్నాయ సెక్షన్ 6లోని నిబంధనలు సవరణకు ముందు లేదా త రువాత జన్మించిన కుమార్తెకు, కొడుకుతో సమాన హక్కులు, వారితో బాధ్యతలతో కోపార్సెనర్ హోదాను కల్పిస్తాయి.
డిసెంబర్ 20, 2004కి ముందు జరిగిన అమ్మ కాలు, బదిలీలు, విభజన లేదా వీలునా మా ద్వారా చేసిన సంక్రమణ అంశాలను సెక్షన్ 6(1)లో మినహాయింపులతో, 9.9. 2005 ముందుగా జన్మించిన కుమార్తె హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కోపార్సెనరీలో హక్కు పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి, తండ్రి కోపార్సెనర్ 9.9.2005 నా టికి జీవించి ఉండాల్సిన అవసరం లేదు.
హిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 6 నిబంధన ద్వారా విభజించందనే చట్టబద్ధమైన భావన. అంతకుముందునుంచే అమలు చేసినట్టు, కోపార్సెనరీ వా స్తవ విభజనను కూడా మార్చినట్టు కాదు.
1956 చట్టంలోని షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా క్లాస్1 మహిళా వారసుడు లేదా అటువంటి మహిళగారి మగవారి బంధువు ద్వారా మరణించిన కోపార్సెనర్ జీవిం చి ఉన్నప్పుడు అతని వాటాను నిర్ధారించడం కోసం మాత్రమే ఈ భావన అవస రం ఏర్పడిందని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
భారత సుప్రీంకోర్టు 15 సంవత్స రాల నాటి సవరణ చట్టానికి సంబంధించి న అన్ని చట్టపరమైన ప్రశ్నలను ముగిం చి, తండ్రి ఆస్తిలో వాటాకు సంబంధించి కు మార్తెలకు సమానత్వ హోదాను ఇచ్చింది.
ఈ భారీ మార్పులవల్ల మహిళల స్వా తంత్య్రానికి చాలావరకు రక్షణ సాధ్యమైం ది. అయినా దాంతో సరిపోతుందంటే త ప్పు. కుటుంబంలో కూడా వరకట్న హత్య లు, పరువు హత్యలు, కులాంతర, మతాంతర పెళ్లి ప్రమాదకరమైన సమస్యలే. ఇం కా రేప్, ఆ నేరాల్లో నివారణ లేకపోగా, వా టి పరిశోధనలో అవినీతి, రాజకీయం ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలన్నా అవి నమ్మడం సాధ్యం కాదు. అర్ధరాత్రి బస్సు లో, కారులో, రైలులో వెళ్లడం కూడా సమస్యలవుతూ ఉంటే ఇంకా మహిళా దినో త్సవాలు చేసుకోవడం సాధ్యమా?






