calender_icon.png 20 February, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేం పద్ధతి?

20-02-2026 01:12:28 AM

ఉచితాలపై సుప్రీంకోర్టు మండిపాటు

  1. ఇదేం సంస్కృతి?.. ఆహార ధాన్యాల నుంచి గ్యాస్ సిలిండర్ వరకు.. అన్నీ ఉచితాలేనా? 
  2. మనం ఎలాంటి నాగరికతను నిర్మిస్తున్నాం?
  3. ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఖజానాలో చిల్లిగవ్వ మిగలదు! 
  4. తమిళనాడులో డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై మందలింపు
  5. ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికీ ఉచిత 
  6. విద్యుత్ హామీ ఎందుకని అత్యున్నత న్యాయస్థానం నిలదీత

* మనం ఎలాంటి నాగరికతను నిర్మిస్తున్నాం? ఉచితాలు ప్రజలను సోమరిపోతులను చేస్తాయి. వారిని పరాన్నజీవులుగా మారుస్తాయి. ఇక ప్రజలు పనిచేయడం మానేస్తారు. ఉచితాలు దేశ నిర్మాణానికి ఏమాత్రం మేలు చేయవు. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలే తప్ప.. ఉచితాలు ఇవ్వకూడదు. ఇలా ఉచితాలు ఇచ్చికొంటూ పోతే, మున్ముందు అభివృద్ధి పనులకు ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా మిగలదు..

చదువుకునేందుకు స్తోమత లేని పిల్లలకు విద్య అందించడం, ప్రతిభ ఉన్నా విద్యకు దూరం అవుతున్న వారికి అండగా నిలవడం, వారి కోసం ప్రత్యేకమైన పథకాలు అమలు చేయడం రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం, అలాంటి పథకాలను మేం కూడా సమర్థిస్తాం. కానీ, ధనవంతులు సైతం ఉచితాల కోసం చూస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి. ఇది ఒక్క తమిళనాడులోనే జరగడం లేదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.     

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౯: ‘రాజకీయ పార్టీలకు సరిగ్గా ఎన్నికల ముందు సంక్షేమ పథ కాలు గుర్తొస్తాయా? అన్నీ ఉచితాలే. ఆహార ధాన్యాల నుంచి గ్యాస్ సిలిండర్ వరకు, విద్యుత్ నుంచి సైకిళ్ల వరకు అన్నీ ఉచితాలే. సరాసరిగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడమేంటి? అర్హత ఉన్నవారికి, లేనివారికి మధ్య వ్యత్యాసం లేకుండా ప్రయోజ నాలు కల్పించడమేంటి? ఇదేం సంస్కృతి? మనం ఎలాంటి నాగరికతను నిర్మిస్తున్నాం? ఉచితాలు ప్రజలను సోమరిపోతులను చేస్తాయి.

వారిని పరాన్నజీవులుగా మారుస్తాయి. ఇక ప్రజలు పనిచేయడం మానేస్తారు. ఉచితాలు దేశ నిర్మాణానికి ఏమాత్రం మేలు చేయవు. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలే తప్ప.. ఉచితాలు ఇవ్వకూడదు. ఇలా ఉచితాలు ఇచ్చికొంటూ పోతే, ము న్ముందు అభివృద్ధి పనులకు ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ కూడా మిగలదు’ అంటూ సుప్రీం కోర్టు గురువారం తమిళనాడు ప్రభుత్వంపై మండిపడింది.

డీఎంకే పార్టీ ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పాంచోలి ధర్మాసనం విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుం డా ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆ రాష్ట్ర పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించడాన్ని తప్పుబట్టింది.

పేద లకు, వెనుకబడిన వర్గాలకు సాయం చేయ డం ప్రభుత్వ బాధ్యతేనని, కానీ.. ఆర్థిక స్తోమ త ఉన్న వారికి కూడా ఉచితాలు పంచడం ఏంటని ప్రశ్నించింది. చదువుకునేందుకు స్తోమత లేని పిల్లలకు విద్య అందించడం, ప్రతిభ ఉన్నా విద్యకు దూరం అవుతున్న వారికి అండగా నిలవడం, వారి కోసం ప్రత్యేకమైన పథకాలు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యమని, అలాంటి పథకాలను తాము కూడా సమర్థిస్తామని స్పష్టం చేసింది.

కానీ, ధనవంతులు సైతం ఉచితాల కోసం చూస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నిలదీసింది. ఇది ఒక్క తమిళనాడులోనే జరగడం లేదని, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. కొన్ని ప్రభు త్వాలు తమ రాష్ట్రాల్లో లోటు బడ్జెట్ ఉన్నా, నగదు బదిలీ చేయడమేంటని తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిం ది. రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మా ణానికి కేటాయించాల్సిన నిధులను ఓట్ల కోసం వాడుకోవడం ఏంటని నిలదీసింది.

ఆ నిధులను దీర్ఘకాలిక ప్రయోజనమిచ్చే నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించాలని సూచించింది. రాజకీయ నేతలు, పార్టీ లు, ఇంజినీర్లు ఈ అంశంపై పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని అభి ప్రాయపడింది. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆత్మగౌరవంతో బతికే విధంగా తీర్చిదిద్దాలే తప్ప.. ఉచితాల పేరుతో వారిని తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికింది.

ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధి సృష్టిపై దృష్టి సారించాలని రాష్ట్రప్రభుత్వాలకు సూచించింది. ఉచిత విద్యుత్ వంటి పథకాల కోసం నిధులు ఎలా సేకరిస్తారో చెప్పాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించింది.