గ్రామీణ క్రీడాకారులకు ఈశా గ్రామోత్సవం వేదిక
ఈశా తెలంగాణ, ఏపీ కో ఆర్డినేటర్స్ స్వామి అంబర, జలజ
ముషీరాబాద్,ఆగస్టు 16(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతా ల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈశా గ్రామోత్సవం కీలక వేదికగా నిలుస్తోందని ఇషా ఫౌండేషన్ వాలంటీర్, ఏపీ కో ఆర్డినేటర్ స్వామి అంబర, తెలంగాణ కో ఆర్డినేటర్ జలజ తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈశా గ్రామోత్సవం తెలంగాణ రాష్ట్ర ఫైనల్ నిర్వహించిన ట్లు వారు వెల్లడించారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది టోర్నమెంట్లో మొత్తం ప్రైజ్మనీ రూ.1 కోటికి పైగా ఉందన్నారు. రాష్ట్ర ఫైనల్ విజేతలకు సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు కో యంబత్తూరులో జరిగే గ్రాండ్ ఫినాలేలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
గ్రాండ్ ఫినాలేలో విజేత జట్లకు రూ.25 లక్ష లు, రన్నరప్కు రూ.3 లక్షలు, మూడో స్థానానికి రూ.1 లక్ష, నాలుగో స్థానానికి రూ.2.5 లక్షల చొప్పున బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. తెలంగాణలో ఈ కా ర్యక్రమానికి స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్) సహకారం అందించిందన్నా రు. ఈశా గ్రామోత్సవం ద్వారా వేలాది మం ది గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉమా, జయలక్ష్మి కూడా తమ క్రీడా అనుభవాలను, గ్రామోత్సవం ద్వారా లభిస్తున్న ప్రోత్సాహంపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.






