30-09-2025 08:52:26 AM
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు సిద్ధమే: ఇజ్రాయెల్ ప్రధాని
వాషింగ్టన్: గాజాలో(Gaza war) యుద్ధం ముగింపునకు ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధమవుతున్నారు. గాజాలో యుద్ధ ముగింపునకు అగ్రరాజ్యం అమెరికా సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. గాజాలో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్ కు ముప్పు ఉండకూడదన్నారు. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా బలగాలు వైదొలుగుతాయని నెతన్యాహు(Benjamin Netanyahu) వెల్లడించారు. భద్రత దృష్ట్య మా బలగాలను గాజా చుట్టుపక్కల మోహరిస్తామని పేర్కొన్నారు.
ఖతార్ పై దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli Prime Minister Netanyahu) క్షమాపణలు చెప్పారు. ట్రంప్ ఒత్తిడితోనే ఖతార్ కు నెతన్యాహు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. పాలస్తీనా సహా అరబ్, ముస్లిం దేశాలు ట్రంప్ శాంతి ఫార్ములాను స్వాగతించారు. గాజాలో ట్రంప్ శాంతిని తీసుకొస్తారని అరబ్ దేశాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. అమెరికా డిమాండ్ మేరకు సంస్కరణలు తీసుకొస్తామని పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది. గాజా పునర్నిర్మాణం, బెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు అనుమతించనని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్(Trump) ప్రకటనను ఖతార్, జోర్డాన్, యూఏఈ, ఇండోనేషియా, పాకిస్థాన్, తుర్కియే, సౌదీఅరేబియా, ఈజిఫ్టు స్వాగతించాయి. ఈ మేరకు ముస్లిం దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోగా, 251 మందిని బందీలయ్యారు. అప్పటి నుంచి జరిగిన యుద్ధంలో 66,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాలో తీవ్ర నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.