13-06-2025 09:14:46 AM
ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్: ఇజ్రాయెల్ ప్రధాని
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్(Iran capital Tehran) పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి(Israeli Air Force attacks Iran) చేసింది. టెహ్రాన్ లో పేలుళ్ల శబ్ధం విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రతి దాడి చేస్తుందనే అనుమానంతో ఇజ్రాయెల్ లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Israeli Prime Minister) పేర్కొన్నారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా సైనిక చర్య అన్నారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా ''ఆపరేషన్ రైజింగ్ లయన్'' కొనసాగుతోందని నెతన్యూహా(Benjamin Netanyahu) ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించింది. అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ రాజధాని అంతటా పేలుళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. గురువారం, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (International Atomic Energy Agency) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, రెండు దశాబ్దాలలో మొదటిసారిగా ఇరాన్‌ను తనిఖీదారులతో సహకరించడంలో విఫలమైనందుకు ఖండించారు.