calender_icon.png 17 July, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ వివాదం.. కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు

17-07-2025 02:37:06 PM

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై గురువారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) సీఐడీకి ఫిర్యాదు చేసింది. కేటీఆర్, కవితతో పాటు మరికొందరు హెచ్సీఐ సభ్యుల పేర్లను టీసీఏ ఫిర్యాదులో పేర్కొంది. సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. హెచ్సీఏలో మనీలాండరింగ్ జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదులో పేర్కొంది. హెచ్సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు కావాలని ఇప్పటికే ఈడీ సీఐడీని కోరింది. సంతకాలు ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం చేసిన వ్యవహారంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సహా ఐదుగురిని సీఐడీ(Criminal Investigation Department) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

హెచ్సీఏ స్కామ్‌లో తలదూర్చిన ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌ రెడ్డిపై(Uppal CI Election Reddy) సస్పెన్షన్‌ వేటు పడింది. పరారీలో ఉన్న హెచ్సీఏ  జనరల్‌ సెక్రటరీ దేవరాజు అరెస్ట్‌కు సీఐడీ రంగం సిద్ధం చేసింది. సీఐడీ సమాచారాన్ని ఎలక్షన్‌ రెడ్డి ముందుగానే దేవరాజుకు చెప్పాడు. సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్‌ చేసినందుకు సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపణలున్నాయి. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శ గురువారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్ కూడా ఫిర్యాదు చేశారు.