calender_icon.png 17 July, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయం

17-07-2025 01:45:09 PM

  1. -ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు 
  2. -పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు, అభిమానులు, ప్రజలు 

హన్వాడ : పండుగ సాయన్న జయంతి వేడుకల(Sayanna Jayanti Celebration) సందర్భంగా మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పండుగ సాయన్న ఎక్కడ ఉంటే అక్కడ పండుగ వాతావరణం ఉండేదని, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పండుగ సాయన్న ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పరితపించే వారిని తెలిపారు. ఇప్పుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పండుగ సాయన్న అందరివారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  వివిధ పార్టీల నేతలు పండుగ సాయన్న అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.