calender_icon.png 17 July, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట

17-07-2025 01:54:49 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy) ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. దీంతో 2016లో రేవంత్ రెడ్డి, సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యపై గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది.