calender_icon.png 12 December, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతకుమించింది తెచ్చిస్తడే..

11-12-2025 12:27:13 AM

రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘అద్దం ముందు’ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పూర్తి పాటను బుధవారం విడుదల చేశారు. ‘చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే..

సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే.. అడిగింది అందిస్తడే.. అంతకు మించింది తెచ్చిస్తడే.. కోరింది తీరుస్తడే.. వేరే కోరిక నాకింక లేకుండ చేస్తాడే.. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటె నువ్వే మరి ఈ నిజం దాచలేనే..’ అంటూ సాగుతోందీ గీతం. రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ మెలోడీ డ్యూయెట్‌ను భీమ్స్ స్వరపర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ గీతంలో నాయకా నాయికల కెమిస్ట్రీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.