calender_icon.png 12 December, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిరత్నాలు డైరెక్టర్‌తో..

11-12-2025 12:28:16 AM

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నటిగా రష్మికలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆమెను ప్రధానంగా చేసుకొని బలమైన కథలతో సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని మేకర్స్‌కు కలిగించిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అందుకే ఇప్పుడు పలువురు దర్శకులు రష్మిక కోసం కథలు అల్లే పనిలో పడ్డారు. వారిలో ముందువరుసలో ఉన్నారు ‘జాతిరత్నాలు’ ఫేం కేవీ అనుదీప్. ఇప్పటికే రష్మిక కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారట.

అయితే.. ఈ కథ అనుదీప్ గత చిత్రాల తరహాలో కామెడీ కాన్సెప్ట్ కాదట. ఈసారి తన ధోరణికి పూర్తి భిన్నంగా భావోద్వేగాలతో కూడిన సీరియస్ కథనే అనుదీప్ సిద్ధం చేశారట. ఇక ఆ కథను నేషనల్ క్రష్‌కు వినిపించడమే తరువాయి. ఈ సినిమా తీసేందుకు స్వప్న సినిమా సంస్థ కూడా సిద్ధంగా ఉన్నదని తెలిసింది. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.