21 July, 2026 | 7:43 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

ఒక్కరోజులోనే కూలిపోవచ్చు..

09-06-2024 02:28 AM

త్వరలోనే కేంద్రంలో ‘ఇండియా’ ప్రభుత్వం 

మమతా బెనర్జీ వ్యాఖ్యలు

కోల్‌కతా, జూన్ 8: కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒక్క రోజులో కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శనివారం కోల్‌కత్తాలో టీఎంసీ పార్టీ సమావేశం అనంతరం ఆమె  మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో త్వరలోనే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి తాము హాజరుకాబో మని తెలిపారు.

ఎందుకంటే అన్యాయంగా, అప్రజాస్వామికంగా ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘400 సీట్లు వస్తాయంటూ బీజేపీ ఊదరగొట్టింది. ఇప్పుడు మెజారిటీ కూడా బీజేపీకి రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి చెప్పకపోయినంత మాత్రాన ఏమీ జరగదని అనుకోవద్దు. ఏం జరుగుతుందో  చూస్తున్నామంతే.. ఇండియా కూట మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కొద్ది రోజులు ప్రభుత్వాన్ని నడపనివ్వండి. 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోవచ్చు. ఎవరికి తెలుసు?’ అని మమతా అన్నారు.