గాజాలో ఆగని మారణ హోమం
09-06-2024 02:29 AM
పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి
ఇజ్రాయెల్, జూన్ 8 : పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడు తోంది. దాడుల్లో భాగంగా మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గాజాలో స్కూల్ నడుపుతున్న ఓ షెల్టర్‌పై ఇజ్రాయెల్ బలగాలు బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. శుక్రవారం రాత్రి పాఠశాలపై ఇదే రకమైన దాడులు చేయగా దాదాపు 28 మంది మరణించారు. మరో ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా పై వరుస దాడులతో 24 గంటల్లోనే 77 మంది పాలస్తీనియన్లు మరణించారని, 221 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కాగా, దాడి జరిపిన ఘటనను ఇజ్రాయిల్ సమర్థించుకుంది.






