20 June, 2026 | 3:47 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌ను నోటీఫై చేసిన ఐటీ శాఖ

21-06-2024 12:10 AM

న్యూఢిల్లీ, జూన్ 20: దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో పన్నును గణించేందుకు అవసరమైన కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ) ఆదాయపు పన్ను శాఖ తాజాగా నోటీఫై చేసింది. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరానికి సీఐఐ 363గా ప్రకటించింది. నిర్ణీతకాలంలో వస్తు, సేవల ధరల పెరుగుదలను ప్రతిబింబించే సీఐఐ గత ఆర్థిక సంవత్సరంకంటే ఈ ఏడాది 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. పన్ను చెల్లింపుదార్లు వారి ఆస్తులను విక్రయించినపుడు ఒనగూడిన లాభాల నుంచి పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఈ సీఐఐ ఉపకరిస్తుంది. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకున్న తర్వాత స్థిరాస్తులు, సెక్యూరిటీలు (షేర్లు, బాండ్లు), ఆభరణాలు తదితర ఆస్తి విక్రయాల ద్వారా వచ్చిన లాభాల్ని సీఐఐ ద్వారా పన్ను చెల్లింపుదార్లు గణించుకుంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 363 సీఐఐ 2025 అసెస్‌మెంట్ సంవత్సరానికి వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో సీఐఐ 348కాగా, 2022 ఇది 331. గత ఆర్థిక సంవత్సరంకంటే ఈ ఏడాది సీఐఐ 15 బేసిస్ పాయింట్లు పెరగడం 4.3 శాతం వార్షిక ద్రవ్యోల్బణానికి సమానం. సీఐఐ ఎక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదార్లకు ట్యాక్స్ రిబేట్ అధికంగా లభిస్తుంది.