ఎప్పుడైనా పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ, జూన్ 20: రిటైల్ ఖాతాదారులు వారి జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దుచేసుకోదలిస్తే బీమా కంపెనీకి తెలియపర్చి, ఎప్పుడైనా పాలసీని క్యాన్సిల్ చేసుకోవ చ్చని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తెలిపింది. అదే బీమా సంస్థ రద్దు చేయదలిస్తే మో సం జరిగిందని రుజువైతేనే క్యాన్సిల్ చేయాలని పేర్కొంది. సాధారణ బీమా వ్యాపారం సంస్కరణల్లో భాగంగా విడుదల చేసిన మాస్ట ర్ సర్క్యులర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. ఖాతాదారు పాలసీని క్యాన్సిల్ చేసుకుంటే, మిగిలిఉన్న కాలానికి నిర్దేశించిన ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థ రిఫండ్ చేయాలని సర్క్యులర్‌లో వివరించింది. సర్వేయిర్ల నియామకం, వారి నివేదికల సమర్పణలతో సహా క్లెయింల సెటిల్‌మెంట్‌కు కఠినమైన సమయపాలనను సైతం ఐఆర్‌డీఏఐ వెల్లడించింది.
సర్వే రిపోర్టులను సమయానికి తెప్పించుకోవడం బీమా సంస్థ బాధ్యత అని పేర్కొంది. మోటారు ఇన్సూరెన్స్‌లో ‘పే యాజ్ యూ డ్రైవ్/పే యాజ్ యూ గో’ అనే అదనపు ఆప్షన్లను ఖాతాదారుకు తొలి ఛాయస్‌గా ఇవ్వాల ని సర్యులర్‌లో ఆదేశించింది. ‘ఫైర్’ పాలసీకి సంబంధించి వరదలు, తుఫాను, భూకంపం, ఉగ్రవాదం తదితరాల యాడ్ ఆన్ కవర్స్‌ను ఎంపికచేసే ఆప్షన్‌ను గృహ యజమానులకు ఇవ్వాలని సూచించింది. పాలసీ వివరాలను సమగ్రంగా తెలియపరుస్తూ పాలసీదారుకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ను బీమా సంస్థలు ఇవ్వాలని, కవరేజ్, మినహాయింపులు, వారెంటీలు, క్లెయిం సెటిల్‌మెంట్ ప్రక్రియ వంటివన్నీ అందులో పొందుపర్చాలని ఆదేశించింది. గతంలో జారీచేసిన 13 సర్క్యులర్లలో ఆదేశాలను పొందుపరుస్తూ ఐఆర్‌డీఏఐ ఒక సమగ్ర మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది.
క్లెయింలు తిరస్కరించరాదు
సాధారణ బీమా కంపెనీలు డాక్యుమెంట్లు సమర్పించమని కోరుతూ క్లెయింలు తిరస్కరించవీలులేదని ఐఆర్‌డీఏఐ పేర్కొం ది. ‘డా క్యుమెంట్ల కోసం ఏ క్లెయిం తిరస్కరించరాదు. బీమా ప్రతిపాదనను స్వీకరిం చినపుడే అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ పాలసీదారు నుం చి తీసుకోవాలి. క్లెయిం సెటిల్‌మెంట్ కోసం (క్యాష్‌లెస్ కాకపోతే) అవసరమైతే ఆ డాక్యుమెంట్లనే సమర్పించమని ఖాతాదారును కోరవచ్చు’ అని సర్క్యులర్‌లో పేర్కొంది.






