6 July, 2026 | 9:38 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

04-10-2024 03:45 PM

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వెలిసిన ప్రాచీనమైన శ్రీ మహాలక్ష్మి దేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజానంతరం మంత్రిని శేష వస్త్రాలతో సన్మానించి మహదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందించారు. ఆలయ ఆవరణలో తొమ్మిది రోజులు నిరంతరాయంగా 24 గంటల పాటు నిర్వహించే భజన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.