13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగారు బాబుపై ఐటీ విచారణ

28-03-2026 02:18 AM
  1. ఒంటిపై ఉన్న అధిక బంగారం వివరాలపై ఆరా
  2. పత్రాలు చూపించాలని సూచన
  3. విచారణ అనంతరం కార్యక్రమానికి అనుమతి

శేరిలింగంపల్లి,మార్చి 27 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమ్పా ఆదాయపన్ను అధికారులు విచారణ నిర్వహించారు. డిల్లీలో నిర్వహించిన హాకీ 8వ జాతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో  పాల్గొనడానికి బయలుదేరిన సమయంలో మొదట హైదరాబాద్ విమానాశ్రయంలోనే ఆయనను నిలిపి వివరాలు అడిగినట్లు సమాచారం.

న్యూఢిల్లీలో దిగిన అనంతరం కూడా అక్కడి అధికారులు ఆయనను ప్రశ్నించి, తన వద్ద ఉన్న బంగారం పరిమాణంపై వివరాలు తెలుసుకున్నారు. నిర్దిష్ట పరిమితికి మించి బంగారం కలిగి ఉండటంతో సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. అధికారులు విచారణలో భాగం గా బంగారాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకుని, అవసరమైన ధృవపత్రాలు చూపించిన తర్వాత తిరిగి పొందాలని అధికారులు కోరినట్లు సమాచారం.

విచారణ పూర్తయ్యాక ఆయనకు హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే విచారణకు హాజరు కావాలని కూడా అధికారులు సూచించినట్లు తెలిపారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు అతిశయోక్తిగా ఉన్నాయని,ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.