28 March, 2026 | 4:00 AM

విద్యా ప్రస్థానానికి 25 ఏళ్లు

28-03-2026 02:19 AM
  1. ఘనంగా హోలీ మేరీ వేడుకలు

పూర్వ విద్యార్థులతో కళకళలాడిన హిట్స్ సిల్వర్ జూబ్లీ

విద్య, విలువలతో 25 ఏళ్ల హిట్స్ విజయయాత్ర

కుషాయిగూడ మార్చి 27 (విజయక్రాంతి) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మం డలం బోగారం లోని హోలీ మేరీ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల (హిట్స్) సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అతిథులతో కళకళలాడింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్ డా. కే. వెంకటేశ్వర రావు ముఖ్య అతి థిగా, మురళి బుక్కపట్నం విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

రిటైర్డ్ అదనపు డీజీపీ డా. కే. బాబురావు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, సెక్రటరీ శారదారెడ్డి, చైర్మన్ సిద్ధార్థరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమా న్యం మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం ఎన్నో కష్టనష్టాలను అధిగమిస్తూ సంస్థను స్థాపించి, నేటి స్థాయికి తీసుకురావడం గర్వకారణమన్నారు.

ఈ కాలంలో వేలాది మంది విద్యా ర్థులను తీర్చిదిద్దామని, వారు దేశ విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు విలువల పెంపకంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంపై అవగాహన పెంపొందించుకోవాలని సూ చించారు.

ఇంజనీరింగ్తో పాటు సివిల్స్, న్యాయ రంగాల్లో కూడా రాణించి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాలను సాధించాలని ప్రోత్సహించారు. దేశాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు రావాల ని, పేదరిక ని ర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వేడుకల సందర్భంగా పూర్వ విద్యార్థులను సత్కరించారు. కళాశాల అభివృద్ధికి విశేష సేవలందించిన సిబ్బందిని ఘనం గా అభినందించారు. అనంతరం వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ, జానపద గేయాలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నా యి. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.