12 April, 2026 | 2:57 AM

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్సే

12-04-2026 01:14 AM
  1. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా
  2. ముచర్ల భూముల్లో రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు..
  3. రైతుల భూములు 22/ఏలో పెట్టి వేధింపులు
  4. ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్ సమావేశంలో ఆ పార్టీ నేత కేటీఆర్ మండిపాటు

రంగారెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో  అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే  రానున్న రోజు ల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బొంగులూరు సమీపంలోని ప్రమిద గార్డెన్స్‌లో ఇటీవ ల గెలుపొందిన నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమంతోపాటు నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూ ములపై కన్నేశారని, రైతుల నోళ్లు కొట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కందుకూరు -ముచర్ల ప్రాంతం లో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల భూమిని, ఇప్పు డు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘గతంలో ఫార్మాసిటీ అంటే పర్యావరణం పాడవుతుంద ని ఏడ్చిన భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డిలు.. ఇప్పుడు అదే భూముల్లో చేస్తున్న భూ దందాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ఉన్న నగరాన్ని అభివృద్ధి చేయకుండా, ఎక్కడో ఫ్యూచర్ సిటీ అంటూ రైతుల దగ్గర భూములు లాక్కోవడం దారుణమన్నారు.

మంత్రి పొంగులేటి సెటిల్‌మెంట్లు..

రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కరించడానికి తెచ్చిన ధరణిని కాంగ్రెస్ నేతలు అడ్డం పెట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల భూములను కావాలనే 22/ఏ (నిషిద్ధ జాబితా)లో పెట్టి, వాటిని విడిపించాలంటే మంత్రి పొంగులేటి అనుచరులతో సెటిల్‌మెంట్లు చేసుకో వాల్సిన పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నలుగురు వ్యక్తులు కూర్చుని భూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని, ఇది అత్యంత హేయ మైన చర్య అని మండిపడ్డారు.

గడ్డిఅన్నారం మార్కెట్ కోసం కేటాయించిన 178 ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. రాష్ట్రం లో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదని, ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని ఎంతవరకు అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. సీఎం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండో.. ఎందుకు పోయిండో  ప్రజలకు తెలుసు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు అన్ని ఇన్ని కావని, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊ రించి.. గద్దెనెక్కి రెండున్నర ఏళ్లు దాటుతున్నా 11 వేల ఉద్యోగాలు కూడా భర్తీచేయ లేదని ఆయన విమర్శించారు. మహిళలకు రూ.2500 ఖాతాలో వేస్తామని, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని, ఉద్యోగ పింఛన్లు కూడా పెంచలేదని.. గడిచిన 28 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు.

అధికారులకు హెచ్చరిక..

ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన మరోసారి గుర్తు చేశారు. ప్రభుత్వం తన అధికారాన్ని ఎంత ఉపయోగించి బీఆర్‌ఎస్‌కు మున్సిపల్ పీఠం దక్కకుండా ప్రభు త్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను, సర్పంచులను ఇబ్బంది పెడుతున్న అధికారులను కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ‘ఇబ్రహీంపట్నం ఏసీపీ, డీసీపీ, కలెక్టర్.. ఎవరైనా సరే చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం, వడ్డీతో సహా చెల్లిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పదవి దిగిపోయాక ఆయన్ని ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు.

భూములు వెనక్కి ఇవ్వాలి: సబిత

ముచర్ల ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాల్సిందేనని చెప్పారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

దందాలకు అడ్డాగా ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దందాలపై అప్పట్లోనే సీపీఐ నేత నారాయణ ‘సర్టిఫికెట్’ ఇచ్చారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. సామాన్య ప్రజల ప్లాట్లు, దేవాదా య భూములను సైతం వదలకుండా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జన్మదిన వేడుకలను కేటీఆర్ సమక్షం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్యామ మల్లేష్, ప్రశాం త్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి  పాల్గొన్నారు.