12 April, 2026 | 2:42 AM

నేడు ఇంటర్ ఫలితాలు

12-04-2026 01:16 AM
  1. ఉదయం 11 గంటలకు విడుదల
  2. వాట్సాప్‌లో ఫలితాలు పొందేలా ఏర్పాట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్టు శనివారం అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాలను http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.inలో చూసుకోవాలని అధికారులు సూచించారు.

దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష లు రాశారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. స్మార్ట్ ఫోన్‌లలో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకొని ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేస్తే ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈసారి వాటర్ ప్రూఫ్ మెమోలను అందించనున్నారు.