11 May, 2026 | 12:42 AM

బంగ్లాలో ఆడడం ఇబ్బందే

20-08-2024 12:30 AM

సిడ్నీ: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కానీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం బంగ్లాలో ప్రపంచకప్ ఆడ డం ఇబ్బందేనని ఆస్ట్రేలియా మహి ళా జట్టు కెప్టెన్ అలీస్సా హీలీ పేర్కొ ంది. అలీస్సా హీలీ మాట్లాడుతూ.. ‘బంగ్లా పరిస్థితుల దృశ్యా అక్కడ క్రికె ట్ ఆడడం ఇబ్బందే. ప్రస్తుతం టోర్నీ నిర్వహణ కంటే మెరుగవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ఈ సమయంలో అక్కడ ఆడడం కష్టమే’ అని తెలిపింది. బంగ్లాలో ఆందోళనలు తారా స్థాయికి చేరడంతో ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఈ పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టోర్నీని దుబాయ్‌కు తరలించే అవకాశముండగా.. తమకు అవకాశమివ్వాలంటూ జింబాబ్వే క్రికెట్ బోర్డు ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే.