24 May, 2026 | 10:44 PM

గద్దెల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను విమర్శించడం సరికాదు

07-09-2025 03:12 PM

ఆదివాసీ హక్కుల పోరాట సమితి- తుడుందెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షుడు పొడెం శోభన్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): శ్రీసమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఆసియా ఖండములోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను 1944వ సంవత్సరము నుండి ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం సంస్కృతి-సాంప్రదాయాల ప్రకారం మా తాత ముత్తాతల కాలం నుండి నిర్వహించుకోడమ జరుగుచున్నది.1944లలో మట్టి గద్దేలతో ప్రతిష్టించబడిన శ్రీసమ్మక్క,శ్రీసారలమ్మ గద్దెలు మరియు 1986లో గోవిందరాజుల గద్దె,2006లో పగిడిద్ధరాజుల గద్దె మట్టి గద్దేలమీద ప్రతిష్టించడం జరిగినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని హైకోర్టు తీర్పుతో 1972లో జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి రావడం జరిగినది. ఒకప్పుడు మట్టి గద్దెలు చుట్టూ తాటి ఆకుల ప్రహరీతో నిర్వహించబడ్డ జాతర కాలానుగుణముగా మార్పులు చెందుతూ వస్తున్నది. ప్రభుత్వాలు జాతర నిర్వహణకు నిధులు కేటాయించడముతో జాతరలో ఇటు పూజారులకు భక్తులకు కావలసిన ఏర్పాట్లను పూజారుల అనుమతి మేరకే ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం జరుగుచూ వస్తున్నది. 

ఒకప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకు భక్తులు అధికముగా వచ్చేవారు. కానీ ఇప్పుడు సంవత్సరాది పొడుగునా భక్తుల అమ్మవార్లను దర్శించుకోవడానికి రావడం జరుగుచున్నది. ఇప్పుడున్న గద్దెల స్థానాల ప్రకారం జాతర సమయములో భక్తులు శ్రీ సమ్మక్క దేవతను దర్శించుకొని తదనంతరం శ్రీసారలమ్మ దేవతను దర్శించుకోవడం తదనంతరం ప్రక్కకు తిరిగి గోవిందరాజును దర్శించుకొని మరల వెనుకకు వచ్చి పగిడిద్ధరాజును దర్శించుకోవడం జరుగుచున్నది. ఈసమయములో బస్టాండ్ నుండి క్యూ లైన్ల ద్వారా తూర్పు ద్వారముగుండా వచ్చిన భక్తులు ఎదురుపడడం, జమ్పన్నవాగు నుండి వచ్చిన భక్తులు కళ్యాణ మండపము వైపు ఉన్న ద్వారము గుండా ప్రవేశించి అమ్మవార్లను ఎలాగోలా దర్శించుకొని గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకోవడా నికి రాగా రద్ది కారణముగా దర్శనం కాకపోవడం,అదే సమయములో దక్షిణ భాగములో ఉన్న పూజరులకోరకు,అధికారుల కొరకు మరియు స్పెషల్ దర్శనం కొరకు ఏర్పాటుచేయబడ్డ ద్వారము గుండా ప్రవేశించిన భక్తులు ముగ్గురు ఒక్కచోట గుమికూడడం వలన తొక్కిసలాట జరుగడం, దొంగతనాలు జరుగడం, కానుకల కోసం ఏర్పాటు చేసిన హుండీల మీద కొబ్బరికాయలు కొట్టడం వలన హుండీల కానుకలు ముద్ద అయిపోవడం,బంగారం విసరడం వళ్ళ గద్దెల మీద పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారులకు గాయాలు కావడం,గద్దేలమీద భక్తులు సమర్పించిన బంగారమును బయటకు పంపడం కోసం భక్తుల దర్శనం నిలిపివేయడం,VIPలు వచ్చినప్పుడు భక్తుల దర్శనాలను నిలిపివేయడం వంటి సమస్యల పరిస్కారముకోసం గత కొన్ని జాతరలుగా గోవిందరాజుల,పగిదిద్ధరాజుల గద్దెల స్థాన మార్పిడి చేయాలని పూజరులుగా ఆలోచన చేస్తూ వస్తున్నాము. అది ఇప్పుడు కార్యరూపం దాల్చడం జరిగినది. 

స్థానిక మంత్ర సీతక్కగాని, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు గాని ప్రభుత్వానికి సంబంధము లేదు. గోవిందరాజు,పగిడిద్ధ రాజుల మూలాలను ముట్టుకోకుండా  గద్దెల స్థాన మార్పు అనేది పూర్తిగా పూజారుల అనుమతి, అంగీకారాలతోనే జరుగుచున్నది . పునః ప్రతిష్ట పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం,మరియు సమ్మక్క,సారలమ్మ, గోవిందరాజుల మరియు పగిదిద్ధరాజుల పూజారుల చేతనే ప్రతిష్ట చేయబడుతుంది తప్పా, మంత్రలు,ప్రభుత్వాల చేత మరియు అధికారుల చేత కాదు. కాబట్టి ఈవిషయములో ఆదివాసీ కులసంఘాలు,ఆదివాసీ ఉద్యోగ సంఘాలు మరియు ఆదివాసీయేతర కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గోవిందరాజుల, పగిడిద్ద రాజుల మూలాలను ముట్టుకోకుండా భక్తుల సౌకర్యార్ధము చేపడుచున్న మంచి కార్యమేతప్ప వేరే ఉద్దేశ్యం లేదు కాబట్టి సమస్త భక్త కోటి జనావళి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కాదని ఈవిషయాన్ని రాజకీయం రాద్ధాంతం చేయాలనీ చూస్తే ఊరుకొనేది లేదని పూజారులుగా హెచ్చరిస్తున్నాము.

పూజారుల భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియా  ద్వారా ప్రసారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము.  అలాగే గత 80సంవత్సరాలుగా శ్రీసమ్మక్క సారలమ్మ జాతరను జాతరను మేడారం గ్రామములో 40 జాతరలు నిర్వహించడం జరిగింది. ఏ ప్రభుత్వము జాతర సమయములో రెండవ పంటకు పంట నష్ట పరిహారము చెల్లించలేదు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వములో ఉన్నతెరాస/బరాస ప్రభుత్వము ఐదు జాతరలు నిర్వహించినది. ఎన్ని దపాలుగా పంట నష్ట పరిహారం చేల్లిన్చినదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఏజెన్సీలో జాతర 50ఎకరముల మాన్యము భూములను ఏజెన్సీ చట్టాలకు విరుద్ధముగా పట్టాలు చేసుకొని బతుదేరువు సాగిస్తున్న గిరిజనేతరులు పంట నష్టపరిహారము అడిగే హక్కు లేదని హెచ్చరిస్తున్నాము. జాతరను,జాతర భూములను అడ్డుపెట్టుకొని గిరిజనేతర్లు మరియు రాజకీయ పార్టీలు శవరాజకీయాలు చేస్తే ఏజెన్సీ నుండి తన్ని తరమాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాము. జాతరను, జాతర అభివృద్ధిని అడ్డుకొనే ఏ రాజకీయ పార్టీని గిరిజనేతరులను ఆదివాసీ హక్కుల పోరాట సమితి-తుడుందెబ్బ వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తున్నాము. అలాగే మా స్థానిక మంత్రి ద్వారా ప్రభుత్వము నుండి ఎక్కువ మొత్తములో నిధులు తీసుకు వచ్చి శాశ్వత నిర్మాణాలు,వసతులు కలిపిస్తుంటే అనవసర ఆరోపణలు,అసత్య ప్రచారాలు చేస్తే ఉరుకోనేది లేదని హెచ్చరిస్తున్నాము.